Raja Saab OTT deal: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన ‘రాజా సాబ్'(The Rajasaab Movie) చిత్రం నిన్న రాత్రి ప్రీమియర్ షోస్ తో ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలై నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అభిమానుల్లో ఈ చిత్రం పై మొదటి నుండి పాజిటివ్ అంచనాలు అయితే లేవు. రెండేళ్ల తర్వాత మా ప్రభాస్ అన్నని ని వెండితెర మీద చూడబోతున్నాం, అది చాలు, ఈ సినిమా ఆడినా, ఆడకపోయినా ఒక దిష్టి చుక్క లాగానే ఉంటుంది అని అనుకున్నారు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ మారుతీ మాట్లాడిన మాటలు, అదే విధంగా రెండు రోజుల తర్వాత విడుదలైన రిలీజ్ ట్రైలర్ బాగా పేలడంతో అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు కాస్త పెరిగాయి. ఈ సినిమా కూడా వర్కౌట్ అయ్యేలా ఉందే అని అనుకున్నారు. అలా మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తీవ్ర స్థాయిలో నిరాశకు గురి చేసింది.
ఇక పోతే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ కూడా విడుదలకు ముందే ఫ్యాన్సీ ప్రైజ్ కి అమ్ముడుపోయింది. ఓటీటీ మార్కెట్ బాగా పడిపోవడం తో ఈమధ్య కాలం లో ఓటీటీ నిర్వాహకులు సినిమాలను విడుదలకు ముందు కొనుగోలు చేయడం మానేశారు. డీలింగ్స్ అయితే పెట్టుకుంటున్నారు , ఎంతో కొంత అడ్వాన్స్ అయితే ఇస్తున్నారు కానీ, ఒకప్పటి లాగా నిర్మాత ఎంత డబ్బు కోరితే అంత ఇచ్చేస్తాము అంటూ అగ్రిమెంట్ చేసుకోవడం లేదు. సినిమా థియేటర్స్ లో విడుదల అయ్యాక, పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకొని భారీగా వసూళ్లను రాబట్టినప్పుడే నిర్మాత కోరినంత డబ్బులు ఇస్తాము, లేదంటే మాకు వర్కౌట్ అయ్యేంత డబ్బులు మాత్రమే ఇస్తాము, ఇష్టముంటే తీసుకోండి లేదంటే లేదని అనేస్తున్నారు. కానీ ‘రాజా సాబ్’ కి అలాంటిదేమి జరగలేదు. విడుదలకు ముందే ఈ చిత్రం జియో హాట్ స్టార్ సంస్థకు ఫ్యాన్సీ రేట్ కి అమ్ముడుపోయింది.
తెలుగు వెర్షన్ నాలుగు వారాల తర్వాత జియో హాట్ స్టార్ లో వచ్చేస్తుంది కానీ, హిందీ వెర్షన్ మాత్రం ఆరు వారాల తర్వాతే హాట్ స్టార్ లో అందుబాటులోకి వస్తుంది. సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది కాబట్టి, ఒకవేళ కలెక్షన్స్ బాగా పడిపోతే అనుకున్న దానికంటే ముందుగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.నేడు ఈ చిత్రానికి ఓపెనింగ్ వసూళ్లు కూడా ఊహించిన రేంజ్ లో లేవు. ప్రభాస్ కి కంచుకోటగా పిలవబడే నైజాం ప్రాంతం ఈరోజు తెల్లవారు జామున అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు . అది ఈ చిత్రానికి బాగా మైనస్ అయ్యింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం ఎంత మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి.