Raja Saab Release Delay Telangana: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) నటించిన ‘రాజా సాబ్'(The Rajasaab Movie) చిత్రం కాసేపట్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ దాదాపుగా అన్ని ప్రాంతాల్లో మొదలయ్యాయి, ఒక్క తెలంగాణ లో తప్ప. మరో రెండు గంటల్లో ప్రీమియర్ షోస్ అంటున్నారు, కానీ ఇప్పటి వరకు తెలంగాణ లో అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టలేదు. అసలు ఈ సినిమా తెలంగాణ లో రిలీజ్ ఉందా లేదా అని నిర్మాతలను ట్యాగ్ చేసి అడుగుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. హైదరాబాద్ లోని మెయిన్ థియేటర్స్ వద్ద ఇప్పటికే ప్రభాస్ అభిమానులు వందల సంఖ్యలో బారులు తీసున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు మొదలు పెడుతారో చెప్పమంటూ థియేటర్స్ యాజమాన్యం పై ఒత్తిడి చేస్తున్నారు. గతం లో పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కానీ బుకింగ్స్ కనీసం విడుదలకు ముందు రోజు సాయంత్రం 6 గంటల నుండైనా బుకింగ్స్ మొదలు పెట్టారు.
కానీ ఇక్కడ ‘రాజా సాబ్’ కి ఆ పరిస్థితి లేదు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే, అసలు ఈ సినిమాకు తెలంగాణ లో ప్రీమియర్ షోస్ ఉండవని అంటున్నారు. అదే కనుక జరిగితే ప్రభాస్ అభిమానుల ఆగ్రహానికి మేకర్స్ బలి అవ్వక తప్పదు. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రభాస్ అభిమానులంతా మరికాసేపట్లో జాలీగా రాజా సాబ్ సినిమాని చూడబోతున్నారు. మొదటి రోజు తమ అభిమాన హీరో సినిమాని మొదటి ఆట చూస్తే వచ్చే అనుభూతి మామూలుది కాదు. పైగా ప్రభాస్ నుండి రెండేళ్ల తర్వాత వస్తున్న చిత్రం. అలాంటిది ఇండియా మొత్తం ప్రీమియర్స్ షోస్ పడిన తర్వాత, తెలంగాణ లో పడకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. రాత్రి ప్రీమియర్ షోస్ చూసిన తర్వాత టాక్ బయటకు వచ్చేస్తుంది. పాజిటివ్ టాక్ వస్తే పర్వాలేదు. కానీ నెగిటివ్ టాక్ వస్తే మాత్రం నిరాశతో తెల్లవారు జామున షో కి వెళ్లాల్సి ఉంటుంది.
కొంతమంది అభిమానులకు అయితే టాక్ లేకపోతే సినిమాని చూసే ఉద్దేశ్యం కూడా ఉండదు. అలాంటి మైండ్ సెట్ ఉన్నోళ్లు కూడా ఉంటారు. ఇప్పటి వరకు ప్రీమియర్స్ కి బుకింగ్స్ ప్రారంభం కాకపోవడానికి కారణం, తెలంగాణ ప్రభుత్వం టికెట్ హైక్స్ ని పెంచుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడం వల్లే. నిర్మాతలు ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నాలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు, కానీ ప్రభుత్వం మాత్రం ఒప్పుకోవడం లేదు. తెలంగాణ హై కోర్టు కి వెళ్లి నిర్మాతలు దయచేసి అనుమతిని ఇవ్వండి అంటూ కోరగా, హై కోర్టు హోమ్ శాఖ నిర్ణయానికే వదిలేసింది. ప్రభుత్వం ఎలాగో టికెట్ హైక్స్ ఇచ్చేందుకు సిద్ధం గా ఉంది కదా, హై కోర్టు అభ్యంతరం తెలపనప్పుడు, ఇక అవలీలగా జీవో వచ్చేస్తుందిలే అని అంతా అనుకున్నారు. కానీ అది జరగడం లేదు. చూస్తుంటే సాధారణ టికెట్ రేట్స్ మీదనే అడ్వాన్స్ బుకింగ్స్ మరికాసేపట్లో మొదలయ్యేలాగా అనిపిస్తోంది.