Raja Saab overseas bookings: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన ‘రాజా సాబ్'(Rajasaab Movie) చిత్రం వచ్చే నెల 9 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో అన్ని ప్రాంతీయ భాషల్లోనూ విడుదల కానుంది. అభిమానుల కోసం ఒక రోజు ముందుగా జనవరి 8న సాయంత్రం 6 గంటల నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ పడనున్నాయి. అయితే ఈ సినిమాకు రెగ్యులర్ ప్రభాస్ సినిమాలకు ఉన్నంత క్రేజ్, హైప్ లేదు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి రెండు పాటలు విడుదలయ్యాయి, ఒక టీజర్ వచ్చింది, థియేట్రికల్ ట్రైలర్ కూడా వచ్చింది. అయినప్పటికీ ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ లో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అవ్వలేదు. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ చిత్రానికి జరుగుతున్నా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే బయ్యర్స్ కి కన్నీళ్లు రావడం ఒక్కటే తక్కువ. నార్త్ అమెరికా లో అయితే పరిస్థితి దారుణంగా ఉంది.
అక్కడ ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై రెండు వారాలు దాటింది. కానీ ఇప్పటి వరకు కేవలం $142K డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అంటే 5 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయట. మిగిలిన ఓవర్సీస్ ప్రాంతాలను కూడా కలిపి చూస్తే కేవలం 7 వేల టికెట్స్ సేల్ అయ్యాయట. వీటిలో 5 వేల టిక్కెట్లు ఈ సినిమాని నిర్మించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నే కొనుగోలు చేసిందట. అసలే తక్కువ టికెట్స్ సేల్ అవుతున్నాయి , అందులో 70 శాతం కి పైగా టిక్కెట్లు నిర్మాతనే కొన్నాడంటే, ఈ సినిమా పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. తక్షణమే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ ట్రైలర్ ని విడుదల చెయ్యాలి. లేదంటే ప్రభాస్ అభిమానులు సైతం ఈ చిత్రాన్ని పట్టింఎంచుకోవడం మానేస్తారేమో, అలా ఉంది పరిస్థితి. వరుసగా అన్ని ఈవెంట్ మూవీస్ చేసిన ప్రభాస్, ఒక్కసారి డిఫరెంట్ జానర్ సినిమాని ఎంచుకుంటే ఆడియన్స్ ఇలా రిజెక్ట్ చేస్తారా అని ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించగా , నిధి అగర్వాల్ , మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటించారు. సినిమా ఆరంభం నుండి చివరి వరకు మారుతీ మార్క్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో, వింటేజ్ ప్రభాస్ రేంజ్ కామెడీ టైమింగ్ తో ఎవ్వరూ ఊహించని విధంగా పొట్ట చెక్కలు అయ్యేలా ఉంటుందట. మరి ప్రభాస్ కి ఇప్పుడున్న ఇమేజ్ కి ఆడియన్స్ కామెడీ యాంగిల్ ని ఏ మేరకు ఎంజాయ్ చేస్తారో చూడాలి.