Shocking news for Non drinkers: మద్యపానం, ధూమపానం వల్ల శరీరానికి అనారోగ్యం. మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ చెడిపోవడమే కాకుండా ఆ తర్వాత మరణం కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే మద్యం తాగవద్దని చాలామంది హెచ్చరిస్తూ ఉంటారు. అయితే కొందరు తమకు మద్యం, ధూమపానం అలవాటు లేదు అని.. ఇక తాము సేఫ్ గా ఉన్నామని అనుకుంటూ ఉంటారు. కానీ మద్యం చేసే వారి కంటే చేయని వారిలో కూడా లివర్ చెడిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా మద్యం చేసేవారిలో లివర్ చెడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మద్యం తాగని వారిలో లివర్ పూర్తిగా చెడిపోయే వరకు కనీస సింటమ్స్ కూడా ఉండవు. అసలు మద్యం తీసుకొని వారిలో లివర్ ఏ విధంగా చెడిపోతుంది అంటే?
ప్రస్తుత కాలంలో చాలామంది ఇంట్లో వండిన ఆహారం కంటే బయట దొరికే ఆహార పదార్థాలని ఎక్కువగా తింటూ ఉంటున్నారు. కొంతమంది అయితే ప్రతిరోజు ప్రాసెస్ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు ఎగబడి వెళ్తున్నారు. కానీ ఈ ఆహారంలో అనేక రకాల ఫ్యాటీ ఉందన్న విషయం కొంతమంది గుర్తించడం లేదు. దీంతో అదే పనిగా ప్రతిరోజు ఈ ఫుడ్ ను తీసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ ఆహారం వల్ల తాత్కాలికంగా మానసికంగా తృప్తి అవుతుంది.. అలాగే ఎనర్జీ కూడా వచ్చినట్లు అవుతుంది. కానీ దీర్ఘకాలంలో మాత్రం ఇది ఫ్యాటీ లివర్కు దారితీస్తుంది. ఆల్కహాల్ తీసుకున్న వారిలో కంటే ఆల్కహాల్ తీసుకొని వారిలో ఇది ప్రమాదకరమైన విషయం వైద్యులు చెబుతున్నారు.
మద్యం తీసుకోకుండా వచ్చే ఫ్యాటీ లివర్ ఏ విధంగా ఉంటుందంటే.. ఇది ఉన్నవారు అధిక బరువుతో ఉంటారు.. వీరికి డయాబెటిక్ వ్యాధి సంక్రమిస్తుంది. కొలెస్ట్రాల్, ట్రెగ్లిసరైడ్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో వీరిలో అలసట, కుడివైపు పొత్తి కడుపులో భారంగా అనిపించడం, ఆకలి తగ్గడం, కొందరిలో లివర్ సైజ్ పెరగడం వంటివి కనిపిస్తాయి. అయితే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ గుర్తించడానికి చాలా రోజులు పడుతుంది. మనం తిన్న ఆహారంలో ఎక్కువగా పిండి పదార్థాలు ఉంటే.. అవి జీర్ణం కాకుండా లివర్ పైనే ఆగిపోతాయి. ఇలా కొన్ని రోజుల తర్వాత లివర్ను ఆక్రమిస్తుంది. దీంతో ఆ తర్వాత తీసుకున్న ఆహారం జీర్ణం కాక సమస్యలు ఏర్పడతాయి.
అందువల్ల మద్యం తాగే వారి కంటే బయట దొరికే ఆహారం తీసుకునే వారిలోనే లివర్ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో బయట దొరికే ఆహారం కాకుండా ఇంట్లోనే వండిన ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇందులోను ఎక్కువగా ఆయిల్, మసాలా వంటివి లేకుండా చూడాలి. అంతేకాకుండా ప్రతి వారంలో కొన్ని రోజులపాటు బీన్స్ వంటివి తీసుకోవాలి. వీటివల్ల శరీరంలోని అనేక ఆర్గాన్స్ ఆరోగ్యంగా ఉండగలుగుతాయి.