Vijay Deverakonda ED Inquiry: బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులను ఈడీ అధికారులు ఒక్కొక్కరిగా పిలిచి విచారిస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్(Actor Prakash Raj) ని పిలిచి విచారించిన ఈడీ అధికారులు, నేడు ప్రముఖ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ని విచారిస్తున్నారు. కాసేపటి క్రితమే ఆయన ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మరి ఈడీ అధికారులు ఆయన్ని ఏమని విచారించారు?, అడిగిన ప్రశ్నలు ఏమిటి అనేది విజయ్ దేవరకొండ బయటకి వచ్చిన తర్వాతే తెలుస్తుంది. ప్రకాష్ రాజ్ తనకి తెలియక ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసానని, తర్వాత అది తప్పు అని తెలుసుకొని వాళ్ళ నుండి డబ్బులు కూడా తీసుకోలేదని చెప్పుకొచ్చాడు. ఇక విజయ్ దేవరకొండ కూడా అలాంటి సమాధానమే ఇవ్వబోతున్నాడా? అనేది చూడాలి.
Also Read: మళ్లీ వాయిదానా? ‘రాజా సాబ్’ పరిస్థితేంటి? ఎప్పుడొస్తుంది?
కేవలం ఒక్క విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ లకే కాదు, రానా దగ్గుబాటి(Rana Daggubati), నిధి అగర్వాల్, విష్ణు ప్రియా ఇలా ప్రముఖ సెలబ్రిటీలందరూ ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన కారణంగా వీళ్ళందరికీ ఈడీ అధికారులు నోటీసులు పంపించారు. దాదాపుగా 30 మంది సెలబ్రిటీలు ఈ లిస్ట్ లో ఉన్నారు. త్వరలోనే రానా దగ్గుబాటి కూడా విచారణకు హాజరు కాబోతున్నాడు. ఇకపోతే విజయ్ దేవరకొండ కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినందుకు తన వైపు నుండి కొద్దిరోజుల క్రితమే సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు. ఇకపోతే రీసెంట్ గానే ఆయన ‘కింగ్డమ్’ చిత్రం తో మన ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుండే డివైడ్ టాక్ రావడంతో డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. భారీ హైప్ ఉండడం వల్ల మొదటి వీకెండ్ మంచి వసూళ్లే వచ్చాయి కానీ, వర్కింగ్ డేస్ లో భారీగా పడిపోయింది.
బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ ఎదుట హజరైన విజయ్ దేవరకొండ#VijayDeverakonda pic.twitter.com/bVH05cS3O1
— Telugu360 (@Telugu360) August 6, 2025