Raja Saab Movie 1st Week Collections: ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం ‘రాజా సాబ్'(The Raja Saab Movie). వరుసగా పాన్ ఇండియన్ యాక్షన్ సినిమాలు చేస్తూ వచ్చిన ప్రభాస్(Rebel Star Prabhas), ఈసారి తన లోకల్ ఆడియన్స్ కి దగ్గరగా ఉండేలా, ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ తో మన ముందుకొచ్చాడు. విడుదలకు ముందు ప్రభాస్ తో పాటు మూవీ టీం మొత్తం కచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని అనుకున్నారు. కానీ మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ రావడం తో ప్రభాస్ కెరీర్ లోనే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది ఈ చిత్రం. అయితే ఎట్టకేలకు వారం రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రాంతాల వారిగా ఎంత వసూళ్లు వచ్చాయి అనేది చూద్దాం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే, ఈ చిత్రానికి మొదటి వారం అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 183 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.
అందులో కేవలం తెలుగు వెర్షన్ నుండి 91 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు సమాచారం. ఇక సంక్రాంతి పండుగ రోజున ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి రెండు కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ వీకెండ్ వరకు కచ్చితంగా ఈ చిత్రం మరో ఆరు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఓవరాల్ గా ఈ చిత్రం క్లోజింగ్ సమయానికి 200 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. డిజాస్టర్ ఫ్లాప్ టాక్ తో ఈ మాత్రం రావడం గొప్పే, కానీ ప్రభాస్ రేంజ్ కి ఇది చాలా అంటే చాలా తక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాకు 200 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
అంటే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 200 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలి. కానీ ఈ చిత్రం వంద కోట్లకు పైగా షేర్ వసూళ్లు, 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. అంటే దాదాపుగా వంద కోట్లకు పైగానే నష్టం వాటిల్లింది అన్నమాట. ‘రాధే శ్యామ్’ తర్వాత మళ్లీ ప్రభాస్ కెరీర్ లో ఆ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ రాదేమో అని అంతా అనుకున్నారు. కానీ అంతకు మించిన డిజాస్టర్ సినిమా వచ్చింది. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కి తీవ్రమైన నిరాశ కలిగించే విషయం. కానీ ఫ్లాప్ అయితే అయ్యింది, ప్రభాస్ కి పెద్ద దిష్టి చుక్క లాంటిది ఈ రాజా సాబ్ చిత్రం , రాబోయే రోజుల్లో డైనోసార్ లాంటి కాంబినేషన్ సినిమాలు ఉన్నాయి, అన్నిటికి వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టే సత్తా ఉన్నాయి, కాబట్టి ఎలాంటి టెన్షన్ అవసరం లేదంటూ సోషల్ మీడియా లో కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.