Slum Dog 33 Temple Road: ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత పూరి జగన్నాథ్(Puri Jagannath) మళ్లీ సినిమాలు చేస్తాడో లేదో అని అంతా అనుకున్నారు. కానీ ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం విడుదలైన కొద్ది రోజులకే ఆయన విజయ్ సేతుపతి(Vijay Sethupathi) తో ఒక సినిమాని ప్రకటించాడు. విజయ్ సేతుపతి అంత తేలికగా స్క్రిప్ట్స్ ని ఒప్పుకోడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. కేవలం వైవిధ్యభరితమైన సినిమాలు, పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ఉంటాడు. అలాంటి విజయ్ సేతుపతి వరుస ఫ్లాప్స్ లో ఉన్న పూరి జగన్నాథ్ చెప్పిన స్టోరీ లో ఏ వైవిద్యం కనిపించిందో?, అసలు ఎలా ఒప్పుకున్నాడో ఇతనితో సినిమా అని అంతా అనుకున్నారు. మొదట్లో ఈ చిత్రానికి ‘బెగ్గర్’ అనే టైటిల్ ని పెట్టాలని అనుకున్నారు. కానీ చివరికి ‘స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్'(Slum Dog – 33 Temple Road) అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని నేడు విడుదల చేశారు. టైటిల్ ని చూస్తుంటే ఇందులో విజయ్ సేతుపతి బిచ్చగాడి క్యారెక్టర్ చేస్తున్నాడని అందరికీ అర్థం అవుతోంది. కానీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కూలింగ్ గ్లాస్సెస్ పెట్టుకొని, చేతిలో కత్తి పట్టుకొని, స్టైల్ గా యాటిట్యూడ్ తో నిల్చున్నాడు. కానీ అతని దుస్తులను చూస్తే మాత్రం బిచ్చగాడి లాగానే కనిపిస్తోంది. ఇక విజయ్ సేతుపతి చుట్టూ బ్యాక్ గ్రౌండ్ డబ్బుల కట్టలు కుప్పలు తెప్పలుగా పడుండడం మనం చూడొచ్చు. చూస్తుంటే ఈసారి పూరి జగన్నాథ్ కాస్త డిఫరెంట్ స్టోరీ లైన్ తో వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఇప్పటికే మన సౌత్ లో బిచ్చగాడి కాన్సెప్ట్ మీద ‘బిచ్చగాడు’, ‘కుబేర’ వంటి సినిమాలు విడుదలై పెద్ద కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి. మరి పూరి జగన్నాథ్ ఈసారి అదే జానర్ లో ఎలాంటి సినిమా తీయబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారిన అంశం.
పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోలు చాలా తోపు యాటిట్యూడ్ తో కనిపిస్తారు. ఇందులో హీరో విజయ్ సేతుపతి కూడా అదే యాటిట్యూడ్ తో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ ని చూస్తుంటే , కటిక పేదరికం లో పుట్టి, కనీసం తినడానికి కూడా తిండి లేదు ఒక మనిషి, ఎలా అయినా జీవితం లో గొప్ప రేంజ్ కి వెళ్ళాలి, పేదరికంలో పుట్టడం నా తప్పు కాదు , కానీ పేదరికం లో చనిపోవడం మాత్రం నా తప్పే అవుతుంది, కాబట్టి కచ్చితంగా గొప్ప ధనికుడిని అవ్వాలి, అందుకోసం ఎలాంటి పనులు చేయడానికి అయినా రెడీ , నో మోరల్స్, ఓన్లీ మనీ అనే కాన్సెప్ట్ మీద ఈ చిత్రాన్ని తీసినట్టు తెలుస్తోంది. ఇది స్టోరీ అయితే పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా, స్టోరీ రైటర్ గా తన విశ్వరూపం చూపించబోతున్నాడు అనేది ఫిక్స్ అయిపోవచ్చు. చూడాలి మరి పూరి కం బ్యాక్ ఇస్తాడా లేదా అనేది.