Mahesh Babu viral video: ఈమధ్య కాలం లో సినీ సెలబ్రిటీలు పబ్లిక్ ఈవెంట్స్ కి వచ్చినప్పుడు అభిమానులు ఎలా వాళ్ళ చుట్టుముట్టుతున్నారో, ఆ కారణం చేత వాళ్ళు ఎంత ఇబ్బందికి గురి అయ్యారో మనమంతా చూసాము. నిధి అగర్వాల్ తో మొదలైన ఈ సంఘటన, ఆ తర్వాత సమంత, తమిళ హీరో విజయ్, అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి, ఇలా ఎంతో మంది సెలబ్రిటీలకు ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. సరిగ్గా ఇలాంటి సంఘటనే నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) కి కూడా ఎదురైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ లో AMB సినిమాస్ ఎంత పాపులర్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమా చూడాలంటే ఈ థియేటర్ లోనే చూడాలి అని అనిపించే రేంజ్ బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది ఈ మాల్. ఒక చోట పెద్ద హిట్ అవ్వడం తో దేశవ్యాప్తంగా ముఖ్య ప్రాంతాల్లో AMB సినిమాస్ ని నిర్మించాలని అనుకున్నాడు మహేష్ బాబు.
అందులో భాగంగానే బెంగళూరు లో గత కొంత కాలం క్రితమే AMB సినిమాస్ నిర్మాణ కార్యక్రమాలను మొదలు పెట్టాడు మహేష్. రీసెంట్ గానే నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సౌత్ ఇండియా లోనే మొట్టమొదటి డాళ్బీ స్క్రీన్స్ ని ఈ మాల్ లో చూడొచ్చు. నేడు ఈ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా బెంగళూరు కి వచ్చాడు మహేష్ బాబు. ఆయన బెంగళూరుకు నేడు వస్తున్నాడు అనే సమాచారాన్ని తెలుసుకున్న అభిమానులు వేల సంఖ్యలో AMB సినిమాస్ వద్ద హాజరయ్యారు. మహేష్ బాబు కారు నుండి బయటకు దిగగానే, ఒక్కసారిగా అందరూ మీద పడిపోయారు. పోలీసులకు మహేష్ బాబు ని రక్షిస్తూ, కారు నుండి లోపలకు తీసుకొని వెళ్ళడానికి చాలా సమయమే పట్టింది. అందుకు సంబంధించిన విజువల్స్ ని మీరు క్రింది వీడియోలో చూడొచ్చు. హైదరాబాద్ లోనే అనుకుంటే, ఎక్కడ చూసినా సినీ సెలబ్రిటీలకు అభిమానుల తాకిడి ఈమధ్య విపరీతంగా పెరిగిపోయింది అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం లో ‘వారణాసి’ అనే చిత్రం చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. శరవేగంగా విరామం లేకుండా జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుపుకుంటుంది. మహేష్ బాబు పై కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్ లో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పాల్గొన్నాడు. ఇందులో ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు కి తండ్రి పాత్రలో కనిపించనున్నాడు. ముందుగా ఈ పాత్ర కోసం అక్కినేని నాగార్జున ని సంప్రదించారు, ఆ తర్వాత తమిళ హీరో చియాన్ విక్రమ్ ని సంప్రదించారు, చివరికి మాధవన్ ని కూడా సంప్రదించారు. కానీ ప్రకాష్ రాజ్ ఫైనల్ అయ్యాడు.
మహేశ్‌బాబును చుట్టుముట్టిన ఫ్యాన్స్
బెంగళూరులో కొత్తగా ప్రారంభమైన AMB Cinemas హాల్‌ను ప్రారంభించేందుకు వెళ్లిన మహేశ్..
భారీగా ఫ్యాన్స్ తరలిరావడంతో మహేష్ లోపలికి వెళ్లడానికి పోలీసులు, సెక్యూరిటీ శ్రమించాల్సి వచ్చింది. pic.twitter.com/jIduknsATW
— ChotaNews App (@ChotaNewsApp) January 16, 2026