Nayanthara Movies: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ అనేది ఎక్కువ కాలంపాటు ఉండదు. కొంతమంది హీరోయిన్స్ అయితే ఎప్పుడూ వచ్చారో తెలీదు ఎప్పుడూ వెళ్ళిపోయారో కూడా తెలీదు. కానీ మరికొందరు మాత్రం కొన్ని సంవత్సరాలపాటు ఇండస్ట్రీలో తమ హవా ను కొనసాగిస్తూ ఉంటారు… నయనతార లాంటి స్టార్ హీరోయిన్ అయితే ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాల పైబడినప్పటికి తను ఇప్పటికీ కూడా వరుస సినిమాలను చేస్తుంది. తను డేట్స్ ఇస్తే చాలు అని ఎదురుచూసే దర్శకులు చాలామంది ఉన్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఆమె రీసెంట్ గా ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ ను దక్కించుకోవడంతో నయనతార పేరు మరోసారి టాప్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఇక ఆమె చేసిన మూడు సినిమాలు ఒకే కథ తో తెరకెక్కిన విషయం మనలో చాలామందికి తెలియదు. ఇంతకీ ఆ సినిమాలేంటి ఆ కథ ఏంటి? అందులో ఎన్ని సినిమాల సక్సెస్ అయ్యాయో మనం ఒకసారి తెలుసుకుందాం…
వెంకటేష్ – నయనతార జంటగా నటించిన తులసి సినిమాలో వెంకటేష్ – నయనతార విడిపోతారు. దాని తర్వాత తన కొడుకుకి దగ్గర ఇవ్వడానికి హీరో తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు… ఫైనల్ గా వాళ్ళను ఎలా కలుసుకుంటారు అనేదే ఆ సినిమా స్టోరీ… అజిత్ – నయనతార హీరో హీరోయిన్స్ గా వచ్చిన ‘విశ్వాసం’ సినిమాలో సైతం వాళ్ళ మధ్య జరిగిన కొన్ని గొడవల వల్ల వాళ్ళిద్దరు విడిపోతారు…
తన కూతురిని కలవడానికి అజిత్ విశ్వ ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు తన కూతుర్ని తన భార్యని ఎలా కలుస్తాడు అనేదే ఈ సినిమా స్టోరీ… ఇక ఈ సినిమా సైతం సూపర్ సక్సెస్ ని సాధించింది… ఇక రీసెంట్ గా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా వచ్చిన మన శంకర్ వరప్రసాద్ సినిమా స్టోరీ కూడా ఇలాంటిదే కావడం విశేషం…
ఇక ఇదంతా తెలుసుకున్న కొంతమంది సినిమా మేధావులు సైతం నయనతార ఒకే కథతో ముగ్గురు హీరోలతో మూడు సినిమాలు చేసింది. విచిత్రం ఏంటంటే ఆ మూడు సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచాయి అంటూ సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…