Homeఎంటర్టైన్మెంట్Raja Saab Item Song: రాజా సాబ్' మూవీ లో స్టార్ హీరో భార్య ఐటెం...

Raja Saab Item Song: రాజా సాబ్’ మూవీ లో స్టార్ హీరో భార్య ఐటెం సాంగ్!

Raja Saab Item Song: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాజా సాబ్'(The Rajasaab Movie) ఈ ఏడాది డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ప్రభాస్ కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ తో పాటు, సాంగ్స్ చిత్రీకరణ ఒకటే బ్యాలన్స్ ఉందట. VFX వర్క్ కూడా దాదాపుగా పూర్తి అయ్యినట్టు సమాచారం. సాధారణంగా ఈ వర్క్ ఎప్పుడో పూర్తి అయ్యింది. కానీ ప్రభాస్ VFX పట్ల సంపూర్ణమైన సంతృప్తి చెందకపోవడం తో మరోసారి రీవర్క్ చేయించాడు. ఈ ఔట్పుట్ చాలా అద్భుతంగా వచ్చిందని, టీజర్ లో చూసినది చివరి ఔట్పుట్ నే అని అంటున్నారు నెటిజెన్స్. ఇది ఎంత వరకు నిజమో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో ఒక అద్భుతమైన ఐటెం సాంగ్ కూడా ఉంటుందట.

Also Read: Ranbir Kapoor Ramayana: హిందీ ‘రామాయణం’ టీజర్ రెడీ..విడుదల తేదీ ఖరారు..ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్!

ఈ ఐటెం సాంగ్ కోసం ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్, సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) (దేవర విలన్) సతీమణి కరీనా కపూర్ ఖాన్(Kareena Kapoor Khan) ని సంపారించారట మూవీ మేకర్స్. ఆమె కూడా ఈ ఐటెం సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. కరీనా కపూర్ బాలీవుడ్ లో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు ఆమె కేవలం కొన్ని సెలెక్టెడ్ హీరోల సినిమాల్లో మాత్రమే ఐటెం సాంగ్స్ చేసింది. మొట్టమొదటిసారి మన సౌత్ హీరో సినిమాలో, అది కూడా మన తెలుగు సూపర్ స్టార్ ప్రభాస్ సినిమాలో ఆమె ఐటెం సాంగ్ చేయబోతుండడం విశేషం. కానీ ఐటెం సాంగ్ చేసేందుకు ఆమె రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకుంటుందట. దాదాపుగా ఆరు కోట్ల రూపాయిల వరకు ఆమె రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసిందట. ఇదే ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన అంశం.

Also Read: Pawan Kalyan : స్పందించిన పవన్ కళ్యాణ్..సినీ నటి పాకీజా కి భారీ ఆర్ధికసాయం!

ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో హీరోయిన్స్ కి నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నటించిన సంగతి తెలిసిందే. మొన్న విడుదలైన టీజర్ లో వీళ్లిద్దరి షాట్స్ హైలైట్ గా నిలిచాయి. ఇక చాలా కాలం తర్వాత ప్రభాస్ కామెడీ టైమింగ్ జానర్ లో సినిమా చేయడంతో సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రం పై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే డైరెక్టర్ మారుతీ ఈ సినిమాని తీర్చి దిద్దాడట. మీడియం రేంజ్ డైరెక్టర్ గా,వరుస ఫ్లాప్స్ ఉన్నప్పటికీ కూడా ప్రభాస్ పిలిచి మరీ అవకాశం ఇచ్చాడని. ఆ అవకాశాన్ని, తన మీద ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తనవంతు నూటికి నూరు శాతం బెస్ట్ ఇవ్వడానికి చాలా గట్టి ప్రయత్నం చేసానని ఆయన టీజర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular