Doctor: ఏదైనా అనారోగ్యం జరిగినప్పుడు వైద్యుల వద్దకు వెళ్దాం. ఆ సమయంలో డాక్టర్లు రాసిచ్చిన మెడికల్ ప్రిస్క్రిప్షన్ తో మెడికల్ షాపు వెళ్లగానే వారికి అర్థమయ్యే మెడిసిన్ ఇస్తూ ఉంటారు. అయితే డాక్టర్లు రాసిన స్క్రిప్ట్ మనకు అస్సలు అర్థం కాదు. ఇది కేవలం మెడికల్ షాప్ వారికి మాత్రమే అర్థమయ్యే విధంగా ఉంటుంది. అయితే వైద్యులు రాసిన ఈ స్క్రిప్టును అర్థం చేసుకొని మరోసారి మెడిసిన్ తీసుకోవాలంటే సాధ్యం కాదు. ఇలాంటి సమయంలో మళ్లీ వైద్యుల వద్దకు వెళ్లే అవకాశం ఉండదు. అయితే ఆ స్క్రిప్టు అర్థం కావాలని ఇప్పటికే చాలామంది ఆందోళన కూడా చేశారు. మరి ఇలాంటి సమయంలో ఈ యొక్క నెంబర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదేంటంటే?
కొందరికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటాయి. వీటి కోసం ప్రతిరోజు మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉంటుంది. అయితే మెడిసిన్ అయిపోయిన తర్వాత మళ్లీ తీసుకు రావడానికి సరైన సమయంలో మెడికల్ షాపులు అందుబాటులో ఉండకపోవచ్చు. దీంతో ఆన్లైన్లో మెడిసిన్ తెప్పించుకుంటారు. అయితే కొందరు వైద్యులు రాసిన స్క్రిప్ట్ అందరికీ అర్థం కాకపోవచ్చు. ఇలాంటి సమయంలో స్క్రిప్టు అర్థం కావడానికి.. ఆ స్క్రిప్ట్ ఏంటో తెలియడానికి ఇప్పుడు వాట్సాప్ లో ఓ చిన్న నెంబర్ను సేవ్ చేసుకోవడం ద్వారా అనుకూలంగా ఉంటుంది.
Also Read: నాగార్జున హోస్టింగ్ పరమ బోరింగ్ అంటూ ‘బిగ్ బాస్ 2’ విన్నర్ కౌశల్ సెన్సేషనల్ కామెంట్స్!
వాట్సాప్ లోAugust AI అనే పేరుతో ఒక నెంబర్ నుంచి ప్రముఖ వైద్యులు ఆన్లైన్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు.8738030604 అనే నెంబర్ను వాట్సాప్ లో సేవ్ చేసుకున్న తర్వాత ఆగస్టు ఏఐ అని కనిపిస్తుంది. ఇలా వచ్చిన తర్వాత అర్థం కాని వైద్యుల స్క్రిప్ట్ ఉంటే దానిని ఫోటో లేదా స్కాన్ చేసి ఈ నెంబర్కు పంపించాలి. వెంటనే అందులో ఉన్న మెడిసిన్ ఏవో వాటిని ఎలా వాడాలో రిప్లై చేస్తారు. అంతేకాకుండా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి చెప్పడంతో వెంటనే బదులిస్తారు. ఈ సేవలు అన్ని ఉచితంగానే ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు ఏవి ఉన్నా చెప్పడానికి ఈ నెంబర్ అనుకూలంగా ఉంటుంది.
ఇక చాలామంది వృద్ధులు తమకు ఉన్న ఆరోగ్య సమస్యలు చెప్పుకోవడానికి వాట్సాప్ లో టైప్ చేసే అవకాశం ఉండదు. ఇలాంటి సమయంలో వారు వాయిస్ మెసేజ్ ద్వారా ఆ నెంబర్కు పంపించిన వైద్యులు బదిలీ ఇచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు ఏదైనా స్కిన్ ప్రాబ్లం ఉంటే దానిని ఫోటో చేసి ఈ నెంబర్కు వాట్స్అప్ ద్వారా పంపించిన సరే వైద్యులు రిప్లై ఇచ్చే అవకాశం ఉంది. ఒక ఫ్యామిలీ డాక్టర్ ఒక కుటుంబానికి ఎంత ఉపయోగకరంగా ఉంటారో అంతే స్థాయిలో ఈ నెంబర్ పనిచేస్తుంది అని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. అందువల్ల ఈ నెంబర్ను సేవ్ చేసుకొని అత్యవసర సమయాల్లోనూ కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ నెంబర్లో సమస్య జన్యు గా ఉంటే పంపించాలని కొందరు పేర్కొంటున్నారు.