Pawan Kalyan : రెండు రోజుల క్రితం ప్రముఖ సినీ నటి వాసుకి (పాకీజా) మంగళగిరి కి చేరుకొని తన ఆర్ధిక పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది అని, చంద్రబాబు(CM Chandrababu Naidu), పవన్ కళ్యాణ్(Deputy CM Pawan kalyan) లు నన్ను ఆదుకోవాలి అంటూ కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అభిమానులు కూడా ఈ వీడియో ని పవన్ కళ్యాణ్ కి చేరే వరకు సోషల్ మీడియా లో బాగా ప్రచారం చేశారు. జనసేన పార్టీ పెద్దలకు ఈ విషయం చేరడం తో పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాడు. ఆమె ఆర్ధిక పరిస్థితి పై ఆరాలు తీసి, ఇంతటి దయనీయమైన స్థితిలో ఉందా అని చలించిపోయారట. వెంటనే ఆమెని మంగళగిరి పార్టీ ఆఫీస్ కి పిలిపించి శాసన మండలి సభ్యులు పిడుగు హరి ప్రసాద్ చేతుల మీద తన తరుపున రెండు లక్షల రూపాయిల ఆర్ధిక సాయం అందించారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ సహాయానికి పాకీజా ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసింది. తమిళనాడు లో ఎన్నో ఏళ్ళ నుండి ఉంటున్నాను, ఆర్ధిక సాయం కోసం ఎంతో మందిని చెయ్యి చాచాను, ఒక్కరు కూడా స్పందించి రూపాయి దానం చేయలేదు, కానీ పవన్ కళ్యాణ్ నా విషయం తెలుసుకున్న వెంటనే పిలిపించి మరీ రెండు లక్షల రూపాయిల ఆర్ధిక సాయం చేశారు, చిన్నవాడైన ఎదురుగా ఆయన ఉండుంటే కాళ్ళు మొక్కుతాను అంటూ తీవ్రమైన భావోద్వేగానికి గురైంది పాకీజా. గతం లో కూడా ఈమెకు నాగబాబు(Nagababu Konidela), చిరంజీవి(Megastar Chiranjeevi) ఈమె ఆర్ధిక స్థితి ని గమనించి సాయం అందించారు. ఈమె జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తాన్ని తన తల్లి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఉపయోగించిందట. కానీ ఇప్పుడు తాను జీవించడానికి, ఒక్క పూట పొట్ట నింపుకోవడానికి కూడా డబ్బులు లేని దీనమైన స్థితిలో ఉందట. ఇలాంటి మహిళకు ఆర్ధిక సాయం అందించినందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు తన అభిమాన నాయకుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.