Ranu Bombai Ki Ranu Song: సంగీతానికి భాష అంటూ ఉండదు. స్వరాలకు ప్రాంతీయ బేధం ఉండదు. రాగానికి వర్గంతో సంబంధం ఉండదు. పల్లవికి ప్రాంతీయతత్వం ఉండదు. పాట అనేది కదిలిస్తుంది. కదిలేలా చేస్తుంది. ప్రశ్నిస్తుంది.. ప్రశ్నకు సమాధానం లభించేలా చేస్తుంది. అందువల్లే సాహిత్యం మనిషి జీవితాన్ని సమూలంగా మార్చేస్తోంది. మనిషికి సంగీతం ఆనందాన్ని మాత్రమే కాదు.. అంతులేని ఉత్సాహాన్ని అందిస్తుంది. అనితర సాధ్యమైన శక్తి యుక్తులను సొంతం చేస్తుంది. ఇప్పుడు అలాంటి పాట ఒకటి దేశాన్ని ఊపేస్తోంది. తెలంగాణ మాండలికంలో రూపొందిన ఆ పాట మొదట ఇక్కడ సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఏకంగా హిందీ బెల్టులో అదరగొడుతోంది.
ఆ పాటలో తెలంగాణ యాస ఉంది. తెలంగాణ భాష ఉంది. తెలంగాణ మాండలికం ఉంది. అన్నింటికంటే తెలంగాణ ఆత్మ ఉంది. అందువల్లే ఆ పాట ఈ స్థాయిలో విజయవంతమైంది. ఇప్పటికే యూట్యూబ్లో 373+ మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పటికీ అది ట్రెండింగ్ లోనే కొనసాగుతోంది. ఆ పాటను ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగే సంభాషణ ఆధారంగా రూపొందించారు. ప్రేమికుడు ఎన్ని ఆశలు చూపించినప్పటికీ.. బొంబాయి కి రాను అంటూ ప్రేమికురాలు అంటుంది. ఇలా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ పాట రూపం అందుకుంది. దానికి తెలంగాణ మాండలికం తోడు కావడంతో దుమ్ము రేపుతోంది.. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు జరిగినప్పుడు ఈ పాటను ప్లే చేశారు. ఈ పాట వస్తుంటే అందాల భామలు స్టెప్పులు వేసి అదరగొట్టారు. వివిధ దేశాలకు చెందిన అందాల భామలు ఈ పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ వేయడం విశేషం.
తాజాగా ఈ పాట హిందీ టీవీ ఛానల్ “కలర్స్” లో కూడా దుమ్ము రేపుతోంది. కలర్స్ టీవీలో ప్రసారమైన ఓ షో లో ఈ పాటను ప్లే చేశారు. యాంకర్ తో పాటు గెస్టు లు ఈ పాటకు స్టెప్పులు వేశారు.. రాను రాను అంటూ పాట ప్లే అవుతుంటే.. గెస్టులు ఏ మాత్రం ఆగలేకపోయారు. వెంటనే తమ సీట్లలో నుంచి లేచి లయబద్ధంగా స్టెప్పులు వేశారు. ఆ పాటకు అర్థం తెలియకపోయినప్పటికీ.. స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. ఇక ఈ షోకు హాజరైన ప్రేక్షకులు కూడా స్టెప్పులు వేశారు. పాట వస్తున్నంతసేపు విపరీతమైన ఉత్సాహంతో కనిపించారు. చప్పట్లు కొట్టి ఆ వేదికను మొత్తం హోరెత్తించారు. అంతేకాదు షోకు వచ్చిన గెస్టులను సైతం మై మరిపింప చేశారు.
ఈ పాట తెలంగాణ మాండలికంలో రూపొందినప్పటికీ దేశవ్యాప్తంగా ఆదరణ సొంతం చేసుకుంటున్నది. పెద్దపెద్ద హీరోలు నటించిన పాటలు కూడా అందుకోలేని సక్సెస్ ను సొంతం చేసుకున్నది. ఇటీవల కాలంలో ఎటువంటి పెయిడ్ వ్యవస్థల సహాయం లేకుండా దాదాపు 373+ కు పైగా మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్నదంటే ఈ పాటకు ఆదరణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
View this post on Instagram