సంగీతం : వివేక్ సాగర్
స్క్రీన్ ప్లే : హసిత్ గోలి
సినిమాటోగ్రాఫర్ : వేదారమన్ శంకరన్
నిర్మాతలు : టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్
నటీనటులు : శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్, సునైన, రవిబాబు తదితరులు.
శ్రీవిష్ణు(Sree Vishnu) హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘రాజ రాజ చోర’(Raja Raja Chora). మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. మరి ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం!
కథ :
భాస్కర్ (శ్రీవిష్ణు) ఓ స్టేషనరీ షాప్‌లో పని చేస్తూ.. సాఫ్ట్ వేర్ ఇంజినియర్ అని అబద్ధం చెప్పి సంజన ( మేఘా ఆకాశ్)ను ప్రేమిస్తూ ఉంటాడు. ఆమె కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీరే. ఇద్దరూ కలిసి సొంతంగా ఇల్లు కట్టుకుని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. అందుకోసం డబ్బు కూడబెడుతుంటారు.ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం భాస్కర్ కి ఇదివరకే పెళ్లి అయిందని, ఒక కొడుకు కూడా ఉన్నాడని సంజనకి తెలుస్తోంది. మరి భాస్కర్ కి నిజంగానే పెళ్లి అయిందా ? విద్య ( సునైన) భాస్కర్ కి ఏమి అవుతుంది ? అసలు, భాస్కర్ ఎందుకు సంజనతో అబద్దాలు చెప్పి మోసం చేస్తున్నాడు ? అసలు కిరీటం, నగలు పెట్టుకుని ఎందుకు దొంగతనానికి వెళ్తాడు ? చివరకు భాస్కర్ జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
శ్రీవిష్ణు ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ లో తన క్యారెక్టరైజేషన్ తో వచ్చే ఫన్ తో బాగా నవ్వించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్స్ లో మంచి కామెడీ టైమింగ్ తో చాలా బాగా ఆకట్టుకున్నాడు. అలాగే ఫస్ట్ హాఫ్ లో వచ్చే లవ్ సీక్వెన్స్ లో అండ్ మిగిలిన కామెడీ సీన్స్ లో కూడా శ్రీవిష్ణు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.
ఇక దర్శకుడు హసిత్ గోలి కూడా రైటింగ్ టేబుల్ పైనే బలంగా సినిమాని సిద్ధం చేసుకున్నాడు. ఆ స్థాయిలో సినిమాని తెరపైకి తీసుకొచ్చాడు.
దొంగతనాలు చేసే వాల్మీకి, రామాయణం రాసే స్థాయికి ఎలా చేరాడనే చరిత్రని గుర్తు చేస్తూ.. ఓ దొంగ పరిణామ క్రమాన్ని బాగా చూపిస్తూ సాగింది ఈ సినిమా.
ముఖ్యంగా పాత్రలు, వాటి పరిచయం, కొన్ని కీలక సన్నివేశాలు సరదాగా సాగుతూ.. జోష్ పెంచాయి. కానీ ద్వితీయార్థంలో కథ మళ్లీ నెమ్మదిస్తుంది. అయితే కొన్ని సీన్స్ లో ఎమోషన్స్ పండినా… ప్రతీ పాత్రకూ జస్ట్ జస్టిఫికేషన్ ఇవ్వటానికి తప్ప ఇంట్రెస్ట్ కలిగించలేదు.
పైగా దర్శకుడు రాసుకున్న స్టార్టింగ్ సీన్స్ కూడా స్లోగా ఉన్నాయి. అలాగే ఎమోషనల్ ట్రాక్ కి సంబంధించి మరింత డిటైల్డ్ గా చూపించి ఉంటే.. సినిమా ఇంకా బెటర్ గా ఉండేది.
ప్లస్ పాయింట్స్ :
శ్రీవిష్ణు నటన,
మెయిన్ పాయింట్, కథలోని మలుపులు,
కామెడీ సన్నివేశాలు,
సంగీతం,
సినిమాలో చెప్పిన మెసేజ్,
మైనస్ పాయింట్స్ :
సెకండాఫ్ స్లోగా సాగడం,
సినిమాటిక్ టోన్ ఎక్కువ అవ్వడం,
హీరో లవ్ ట్రాక్స్.
సినిమా చూడాలా ? వద్దా ? :
భిన్నమైన కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా సరదగా సాగుతూ బాగానే ఎంటర్టైన్ చేస్తోంది. గ్రిప్పింగ్ నరేషన్ , కథలోని సహజత్వం వంటి అంశాలు బాగున్నాయి. ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. తప్పకుండా చూడొచ్చు.
రేటింగ్ 3