Raj Tarun: మస్తాన్ సాయితో లావణ్య ఎఫైర్ లో ఉంది.. సంచలన విషయాలు బయటపెట్టిన హీరో రాజ్ తరుణ్…

Raj Tarun: హిమాచల్ ప్రదేశ్ సీఎం వాళ్ల నాన్నకి ఫ్రెండ్ అని, కావాలనుకుంటే నిన్ను అడ్రస్ లేకుండా కూడా చేయగలం అంటూ తనని బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ లావణ్య ఆరోపించింది...

Written By: Gopi, Updated On : July 5, 2024 5:42 pm

Raj Tharun reaction on Lavanya police case

Follow us on

Raj Tarun: టాలీవుడ్ హీరో అయిన రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడనే ఉద్దేశ్యం తో నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో లావణ్య అనే అమ్మాయి కంప్లైంట్ చేసింది…ఇక లావణ్య ఫిర్యాదు మేరకు రాజ్ తరుణ్ ‘తిరగబడరా సామి ‘ అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న మాల్వీ మల్హోత్రా తో కలిసి ఉంటున్నాడని తన వల్లే రాజ్ తరుణ్ నన్ను పట్టించుకోవడం లేదని ఆమె స్టేట్మెంట్లో తెలియజేసింది. ఇక అదే విధంగా మాల్వీ మల్హోత్రా అలాగే తన సోదరుడు అయిన మయాంక్ ఇద్దరూ కలిసి రాజ్ తరుణ్ ను వదిలేయమని లేకపోతే చంపుతామంటూ తనను బెదిరించారని లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది…

ఇక అంతేకాకుండా హిమాచల్ ప్రదేశ్ సీఎం వాళ్ల నాన్నకి ఫ్రెండ్ అని, కావాలనుకుంటే నిన్ను అడ్రస్ లేకుండా కూడా చేయగలం అంటూ తనని బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ లావణ్య ఆరోపించింది… ఇక ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ ఈ విషయం మీద స్పందిస్తూ లావణ్య అనే అమ్మాయితో తను 2017 కు ముందు డేటింగ్ చేసినట్టుగా అంగీకరించాడు. అలాగే లావణ్య కూడా తన రూమ్ లోనే ఉండేదని ఒప్పుకున్నాడు. ఇక అప్పుడు పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నాడట. కానీ ఆమె వైఖరి వేరేగా ఉండడంతో ఆమె నుంచి తను పక్కకు తప్పుకున్నట్టుగా చెప్పాడు.

అలాగే 2017 వ సంవత్సరం తర్వాత నుంచి ఇప్పటివరకు వాళ్లకు ఫిజికల్ గా ఎలాంటి సంబంధం లేదని ప్రస్తుతం మస్తాన్ సాయి అనే అబ్బాయి తో ఆమె లివింగ్ రిలేషన్ లో ఉంది. గత రెండు సంవత్సరాల కిందట మస్తాన్ సాయి నన్ను రేప్ చేశాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. ఇప్పుడు చేసుకోవట్లేదు అని తను గుంటూరులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందని రాజ్ తరుణ్ చెబుతూ ఎఫ్ ఐ ఆర్ ఫైల్ కాపీని కూడా చూపించాడు. మస్తాన్ సాయి అనే వ్యక్తి తోనే తను ఉంటుంది. అతను ఆమె లవర్ అని చెప్పాడు. ఇక రాజ్ తరుణ్ వాదన ప్రకారం ఆమె వేరే వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. మస్తాన్ తో పాటు డేటింగ్ కూడా చేస్తుంది. అలాంటప్పుడు నేను ఆ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాను అంటూ తన వాదనని వినిపిస్తున్నాడు.

అలాగే ఆ అమ్మాయిని వదిలేయడానికి కూడా ముఖ్య కారణం ఏంటి అంటే తను ఎక్కువగా డ్రగ్స్ తీసుకునేదని తన చుట్టూ ఒక బ్యాచ్ ఉండేదని ఆ బ్యాచ్ టార్చర్ భరించలేక, ఈ అమ్మాయి పెట్టే ఇబ్బందుల్ని ఎదుర్కోలేక తన నుంచి విడిపోయానని చెప్పాడు. అలాగే అప్పట్నుంచి చాలాసార్లు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుతుందని రాజ్ తరుణ్ తెలియజేశాడు…ఇక మొత్తానికైతే ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే…