Anant Ambani Radhika Wedding: అనంత్‌-రాధిక సంగీత్‌ కోసం జస్టిన్‌ బీబర్‌ కు రూ.83 కోట్లు.. అంబానీ ఖర్చు మామూలుగా లేదుగా!

జస్టిన్‌ బీబర్‌ 2017లో తొలిసారి ఇండియాకు వచ్చారు. భారత్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2022లో భారత్‌కి రావాల్సి ఉండగా ఆరోగ్య కారణాలతో రాలేకపోయారు. ఇదిలా ఉంటే.. కొద్ది రోజులుగా అంబానీ ఇంట అనంత్- రాధికల పెళ్లి ముందస్తు వేడుకలు జరుగుతున్నాయి.

Written By: Raj Shekar, Updated On : July 5, 2024 5:48 pm

Anant Ambani Radhika Wedding

Follow us on

Anant Ambani Radhika Wedding: ఆసియా కుబేరుడు.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధితే ముకేష్‌ అంబాని తనయుడు అనంత్‌ అంబానీ-రాధిక మర్చెంట్‌ వివాహ వేడుకలు మొదలయా‍్యయి. రెండుసార్లు ప్రీవెడ్డింగ్‌ వేడుకలనే అంగరంగ వైభవంగా నిర్వహించిన అంబానీ.. పెళ్లి వేడుకలను నభూతో న భవిష్యత్‌ అన్నట్లుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై 12న వారి పెళ్లి జరుగనుంది. ఈ నేపథ్యంలో పెళ్లి వేడుకలు ఇప్పటికే మొదలయ్యాయి.

సంగీత్‌ ప్రారంభం..
పెళ్లి వేడుకలో‍్ల భాగంగా శుక్రవారం(జూలై 5) నుంచి సంగీత్‌ ప్రారంభం కానుంది. సాయత్రం నుంచి వేడుకలు మొదలు పెట్టనున్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా సింగర్ జస్టిన్ బీబర్ ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. ఈమేరకు బీబర్‌ ఉదయం ముంబై చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బీబర్‌ గులాబీ రంగు స్వెట్టర్ట్‌, ఎరుపు రంగు బకెట్‌ టోపీ ధరించి ఉన్నాడు. సంగీత్‌లో పాటలు పాడేందుకు అంబానీ అతనికి రూ.83 కోట్లు చెల్లిస్తున్నట్లు తెలిసింది. అతనితోపాటు మరికొంతమంది సంగీత్‌లో పాటలు పాడతారని సమాచరం.

2017లో భారత్‌లో కచేరీ..
జస్టిన్‌ బీబర్‌ 2017లో తొలిసారి ఇండియాకు వచ్చారు. భారత్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2022లో భారత్‌కి రావాల్సి ఉండగా ఆరోగ్య కారణాలతో రాలేకపోయారు. ఇదిలా ఉంటే.. కొద్ది రోజులుగా అంబానీ ఇంట అనంత్- రాధికల పెళ్లి ముందస్తు వేడుకలు జరుగుతున్నాయి. జులై 2న 50 జంటలకు సామూహిక వివాహాలు జరిపించి భారీగా కానుకలు ఇచ్చారు. జులై 3న మామేరు కార్యక్రమం నిర్వహించింది. జులై 4న రాత్రికి సంగీత్ ఏర్పాటు చేసింది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ జూలై 12న పెళ్లి చేసుకోబోతున్నారు. శుక్రవారం సాయంత్రం ముంబైలోని బీకేసీలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో సంగీత్ నిర్వహించనున్నారు. దీనికి కుటుంబం, బాలీవుడ్ ప్రముఖులతోపాటు ఇతర సెలబ్రిటీలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.