Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు సర్వార్ధ సిద్ధియోగం ఏర్పడనుంది.మరికొన్ని రాశుల వారు సమస్యలు ఎదుర్కొంటారు. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
బంధువుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. జీవిత భాగస్వామి కోసం సమయం కేటాయిస్తారు. పిల్లల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు కుటుంబ సభ్యుల నుంచి సలహా తీసుకుంటారు. స్నేహితులతో సరదాగా ఉంటారు.
వృషభ రాశి:
వ్యాపారులు ఆదాయం కోసం కష్టపడాల్సి వస్తుంది. ప్రియమైన వారి కోసం బహుమతులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. స్నేహితులో ఉల్లాసంగా ఉంటుంది.
మిథున రాశి:
ఈ రాశిపై వినాయకుడి ఆశీస్సులు ఉంటాయి. ఉద్యోగులు అనుకున్నది సాధిస్తారు. టీమ్ వర్క్ లో ఉండే వారికి అధిక ప్రయోజనాలు. వ్యాపారులకు కొత్త ఆదాయం వస్తుంది. భాగస్వాముల మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. కుటంబ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
కర్కాటక రాశి:
కుటంబ సభ్యులతో ఆహ్లాదంగా ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు కొత్త ప్రణాళికలు వేస్తారు. కుటంబ బాధ్యతలను నెరవేరుస్తారు.
సింహారాశి:
కొన్ని శుభవార్తలు వింటారు. సోదరులతో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు సినియర్ల సలహాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. తల్లిదండ్రులకు సేవ చేయడంలో నిమగ్నమవుతారు.
కన్య రాశి:
సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు. జీవిత భాగస్వామితో విహార యాత్రకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు.
తుల రాశి:
వినాయక చవితి సందర్భంగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది. కొన్ని ముఖ్యమైన పనులపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. కొత్త వస్తువుల కొనుగొలుపై దృష్టి పెడుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
వృశ్చిక రాశి:
ఆర్థిక లావాదేవీలపై చర్చిస్తారు. చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. చిన్న పిల్లలతో కలిసి సరదాగా ఉంటాయి. సాయంత్రం స్నేహితులను కలుస్తారు.
ధనస్సు రాశి:
ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబుడులు పెడుతారు. పెండింగ్ బకాయిలను తీరుస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది.
మకర రాశి:
ఉద్యోగులు కార్యాలయాల్లో ప్రతిభ చూపుతారు. దీంతో వారికి ప్రమోషన్ వస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. భూమి కొనాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. అయితే ఈ విషయంలో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
కుంభరాశి:
ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. వ్యాపార లక్ష్యం కోసం కష్టపడుతారు. ఎదుటి వారితో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు.
మీనరాశి:
ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఈ రాశి వారికి విష్నేశ్వరుడి అండ పుష్కలంగా ఉంటుంది.