South Directors: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. వాళ్ళు చేసిన సినిమాలతో ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టుకుంటారు… ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాతో సూపర్ సక్సెస్ లను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తారు…
Also Read: రాజమౌళి తో గొడవ పెట్టుకొని మరి తను అనుకున్నది సాధించుకున్న వేణు మాధవ్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలందరూ భారీ విజయాలను సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే మన స్టార్ హీరోలు పాన్ ఇండియాలో సైతం భారీ విజయాలను అందుకుంటున్నారు. ఇక ప్రస్తుతం మన దర్శకులు తెలుగు సినిమా ఇండస్ట్రీని కాదని వెళ్లి అక్కడ కూడా వండర్స్ ని క్రియేట్ చేస్తున్నారు. కబీర్ సింగ్, అనిమల్ సినిమాలతో వరుసగా భారీ సక్సెస్ లను సాధించిన సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా అలరించాడు. అలాగే అక్కడున్న హీరోలందరూ సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు అంటే ఆయన ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు…
ఇక సందీప్ తర్వాత సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన అట్లీ (Atlee) ‘జవాన్ కి (Jawan) సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక ఆయన సాధించిన విజయంతో ఒక్కసారిగా ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ మంది స్టార్ డైరెక్టర్లలో తను కూడా ఒకడిగా మారిపోయాడు.
ఇక ప్రస్తుతం గోపీచంద్ మలినేని సన్ని డియోల్ తో కలిసి చేసిన ‘జాట్ ‘ సినిమాతో భారీ విజయాన్ని సాధించాడు. ఇక ఆయనతో సినిమా చేయడానికి అక్కడ స్టార్ హీరోలు సైతం పోటీ పడుతున్నారు. గోపీచంద్ మలినేని యాక్షన్ కమర్షియల్ సినిమాలను చేయడంలో చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
కాబట్టి ఇప్పుడు ఆయన డైరెక్షన్ లో నటించడానికి చాలామంది హీరోలు ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…ఇక వీళ్ల బాటలోనే మరి కొంతమంది సౌత్ దర్శకులు నడుస్తున్నారు. వాళ్ళు కూడా బాలీవుడ్ వెళ్లి అక్కడ భారీ సక్సెస్ ను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నారు…