Rahul Sipligunj Marriage: ఓల్డ్ సిటీ లో పుట్టి పెరిగి, ఆస్కార్ అవార్డ్స్ వరకు వెళ్లిన ప్రముఖ సింగర్, బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ విన్నర్, రాహుల్ సిప్లిగంజ్(Rahul Silpligunj) నేడు ఒక ఇంటి వాడు అయ్యాడు. కొద్దిరోజుల క్రితమే హరిణ్యా రెడ్డి తో నిశ్చితార్థం చేసుకున్న ఆయన, నేడు తెల్లవారుజామున ఆమె మెడలో మూడు ముళ్ళు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. గత కొంతకాలం నుండి హరిణ్యా తో ప్రేమాయణం నడుపుతూ, ఆమెతో డేటింగ్ చేస్తూ వచ్చిన రాహుల్, పెద్దలను ఒప్పించి ఈ పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహమహోత్సవానికి సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్ళు, అదే విధంగా రాజకీయ ప్రముఖులు కూడా హాజరు అయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. నెటిజెన్స్ వీటిని చూసి ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
రాహుల్ సిప్లిగంజ్ ముందుగా యూట్యూబ్ లో ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ దమ్ము చిత్రం లో ‘వాస్తు బాగుందే’, రామ్ చరణ్ రంగస్థలం చిత్రం లో ‘రంగా రంగా రంగస్థలనా’ వంటి పాటలతో బాగా పాపులర్ అయ్యాడు. ఇక #RRR చిత్రం లో కాలభైరవ తో కలిసి ఆయన పాడిన ‘నాటు నాటు’ పాట ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఒప్పందమే కాకుండా, ఆస్కార్ అవార్డు ని కూడా సొంతం చేసుకుంది. అంతే కాకుండా గతం లో ఈయన తెలుగు బిగ్ బాస్ మూడవ సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, టైటిల్ కూడా గెలుచుకున్నాడు. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు పునర్నవి భూపాళం తో ప్రేమాయణం నడిపిన రాహుల్, బయటకు వచ్చాక మా మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని చెప్పి ఆడియన్స్ కి అప్పట్లో ఫ్యూజులు ఎగిరిపోయే రేంజ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 7 లో ఆడియన్స్ కి బోలెడంత కంటెంట్ ఇచ్చి వెళ్లిన రతికా తో కూడా రాహుల్ సిప్లిగంజ్ ప్రేమాయణం నడిపాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ, వీళ్లిద్దరి లవ్ బ్రేక్ అయ్యింది. ఇలా ఎన్నో మలుపుల తర్వాత ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ హరిణ్యా ని పెళ్లాడాడు.
Telangana Jagruthi chief @RaoKavitha blessed the newly wed @Rahulsipligunj couple pic.twitter.com/LJkYUREl5q
— SS Sagar (@SSsagarHyd) November 27, 2025