Chikiri Chikiri Making Video: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటించిన ‘పెద్ది'(Peddi Movie) చిత్రం పై ప్రస్తుతం ఫ్యాన్స్, ఆడియన్స్ లో ఉన్న అంచనాలు సాధారణమైనవి కావు. ఎప్పుడైతే ఈ సినిమా నుండి గ్లింప్స్ వీడియో విడుదలైందో అప్పటి నుండే ఈ చిత్రం పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక రీసెంట్ గా విడుదలైన ‘చికిరి చికిరి'(Chikiri Chikiri) పాట అయితే సెన్సేషన్ సృష్టించింది. ఎక్కడ చూసినా ఈ పాట నే ఇప్పుడు వినిపిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో కానీ, యూట్యూబ్ షార్ట్స్ లో కానీ ఈ పాట మీద రోజులకు వేల సంఖ్యలో వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. ఈమధ్య కాలం లో ఒక సినిమా పాటకు ఈ రేంజ్ రీచ్ రావడం ఎప్పుడూ జరగలేదు. గతం లో ఎన్నో పాటలకు అద్భుతమైన రీచ్ అయితే వచ్చింది కానీ, ఇలా దేశాలు, ఖండాలు దాటి మరీ ఆడియన్స్ ఒక పాటకు వైబ్ అవ్వడం ఈ చిత్రానికే జరిగింది.
ఇప్పటి వరకు ఈ పాటకు యూట్యూబ్ లో అన్ని భాషలకు కలిపి 100 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. కేవలం తెలుగు వెర్షన్ నుండి ఈ పాటకు యూట్యూబ్ లో 70 మిలియన్ వ్యూస్ వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఏ రేంజ్ లో ఈ పాట హిట్ అయ్యిందో అనేది. ఇదంతా పక్కన పెడితే ఈ పాటకు 100 మిలియన్ వ్యూస్ వచ్చిన సందర్భంగా మేకర్స్ నేడు మేకింగ్ వీడియో ని విడుదల చేశారు. ఈ మేకింగ్ వీడియో ని చూస్తే మూవీ టీం ఈ పాటని చిత్రీకరించేందుకు ఎంత కష్టపడ్డారో తెలుస్తోంది. ఎత్తైన కొండని ఎక్కడానికి రోప్ సహాయం అందుకున్నారు. రామ్ చరణ్ తో పాటు , మూవీ టీం కూడా రోప్ సహాయం తోనే పైకి వెళ్లారు. మధ్యలో రామ్ చరణ్ బుచ్చి బాబు తో సంభాషిస్తూ ‘కాస్త జాగ్రత్త బుచ్చి బాబు..పడిపోతావు..అసలే నిన్ను తల తల అని పిలుస్తుంటారు’ అని అన్నాడు.
ఆ తర్వాత చివర్లో బుచ్చి బాబు రామ్ చరణ్ తో మాట్లాడుతూ ‘చిరుత సినిమా విడుదలకు ముందు మేమంతా రామ్ చరణ్ గారు వెండితెర పై ఎలా కనిపిస్తారో అనే టెన్షన్ లో ఉన్నాం. కానీ సినిమా విడుదల అయ్యాక మా మైండ్ బ్లాక్ అయ్యింది. ఒక్కో పాట ని రెండు సార్లు వేయించుకొని చూసాము, అలాంటి నేను ఇప్పుడు మీతో సినిమా చేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు బుచ్చి బాబు. సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్న ఈ మేకింగ్ వీడియో ని ఎక్సక్లూసివ్ గా మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
