Kadiyam Srihari : కడియం శ్రీహరి.. ప్రస్తుతం పార్టీ ఫిరాయింపులపై విచారణ ఎదుర్కొంటెన్న నేత. బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచిన కడియం.. తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. కూతురుకు కాంగ్రెస్ టికెట్ ఇప్పించుకుని ఎంపీగా గెలిపించారు. పార్టీ ఫిరాయింపుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టులను ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఆదేశంతో విచారణ జరుగుతోంది. కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తారన్న ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో తాను రాజీనామా చేయడం లేదని కడియం ప్రకటించారు. తాజాగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్‌కు నాయకత్వ లక్షణాలు లేవు..
కేటీఆర్‌కు నాయకత్వ లక్షణాలు లేవని, అందుకే బీఆర్‌ఎస్ పార్టీ నుంచి పలువురు నేతలు దూరం అవుతున్నారని కడియం ఆరోపించారు. కేటీఆర్‌పై పది కేసులు ఉనానయి వెల్లడించారు. అహంకారంతో మాట్లాడే నాయకుడు నిలబడలేవని పేర్కొన్నారు. కేసీఆర్ ఉన్నంతకాలం హరీశ్ రావు పార్టీలో ఉంటారన్నారు. కేసీఆర్ తరువాత బీఆర్‌ఎస్ ముక్కలవుతుందని జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్‌కు భవిష్యత్ లేదని స్పష్టం చేశారు.
కడియంపై వేలాడుతున్న అనర్హత కత్తి..
ఇదిలా ఉంటే కడియం శ్రీహరిపై పార్టీ ఫిరాయింపు నేపథ్యంలో అనర్హత వేటు పడుతుందని బీఆర్‌ఎస్ నాయకులు నమ్మకంగా ఉన్నారు. కడియం బీఆర్‌ఎస్ టికెట్‌పై స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీ మారారు. కడియం కూతురుకు బీఆర్‌ఎస్ ఎంపీ టికెట్ ఇచ్చింది. అయినా దానిని కాదని, కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ ఎంపీ టికెట్‌పై పోటీచేసి గెలిచారు. ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. ఈమేరకు ఆధారాలు ఉన్న నేపథ్యంలో కడియంపై అనర్హత పడుతుందని తెలుస్తోంది. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే, కాంగ్రెస్ టికెట్‌పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఆయనపైనా అనర్హత కత్తి వేలాడుతోంది.
తాజాగా కడియం బీఆర్‌ఎస్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఇటు బీఆర్‌ఎస్‌లోనూ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.