సహజంగా ప్రేక్షకులను భయపెట్టడమే తన సక్సెస్ గా మార్చుకున్న రాఘవ లారెన్స్, ఇలాంటి లుక్ లో ఒక సినిమా చేస్తాడని ఎవరూ ఊహించలేదు. అఘోరా కూడా ఇంకా సాఫ్ట్ గా కనిపిస్తాడేమో. కానీ, లారెన్స్ మాత్రం ఈ లుక్ లో అఘోరాలనే భయపెట్టేలా ఉన్నాడు. ఇంతకీ ఈ పోస్టర్ ఏ సినిమాలోది అంటే.. లారెన్స్ ప్రస్తుతం చేస్తోన్న ‘దుర్గ’ సినిమాలోది.
#Durga !!!
Need all your blessings 🙏🏻 pic.twitter.com/pVYNepkgFM
— Raghava Lawrence (@offl_Lawrence) August 6, 2021
రాఘవ లారెన్స్ ఈ సినిమా ఫస్ట్ అండ్ సెకండ్ లుక్ పోస్టర్స్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన వెంటనే.. ఇవి వైరల్ గా మారాయి. పోస్టర్ లో లారెన్స్ అఘోరా వేషంలో కనిపించడంతో అందరికీ ఆసక్తి కలిగింది. మొత్తానికి ఈ పోస్టర్ ను చూస్తుంటే.. ఈ సినిమా కూడా లారెన్స్ తనకు బాగా కలిసొచ్చిన హారర్ నేపథ్యంలోనే తీస్తున్నట్లు అనిపిస్తోంది.
అయితే, ఈ సినిమాలో రాఘవ నటిస్తూ.. స్క్రిప్ట్ రాస్తున్నా.. దర్శకత్వ బాధ్యతల జోలికి మాత్రం వెళ్లలేదు. త్వరలోనే ఈ సినిమాకి దర్శకత్వం వహించే దర్శకుడి పేరును కూడా అధికారికంగా ప్రకటిస్తామని లారెన్స్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే లారెన్స్ ‘ముని, కాంచన, గంగ(కాంచన 2), కాంచన 3’ వంటి సినిమాలతో హారర్ నేపథ్యంలో తిరుగులేని హీరోగా వరుస సక్సెస్ లు అందుకున్నాడు. కాబట్టి, ఈ కొత్త హారర్ సినిమా పై కూడా మంచి అంచనాలు ఉండే అవకాశం ఉంది.
#Durga second look! #RagavendraProductions pic.twitter.com/XjNhGhmylU
— Raghava Lawrence (@offl_Lawrence) August 6, 2021