దాంతో, ‘శిల్పాశెట్టి’ చేస్తున్న టీవీ షోలలో ఆమె స్థానంలో వేరే వారిని ఖాయం చేస్తున్నారు ఆయా కార్యక్రమాల యాజమాన్యం. ‘శిల్పాశెట్టి’ చాలా కాలంగా చేస్తోన్న “సూపర్ డ్యాన్సర్ 4″ నుండి కూడా తాజాగా ఆమెను శాశ్వితంగా తప్పించారట. ఇప్పుడు శిల్పా ప్లేస్ లో మరో సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రేని గెస్ట్ గా నియమించినట్లు తెలుస్తోంది.
ఈ షో కారణంగా శిల్పా శెట్టికి నెలకు రెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. అదే సోనాలి బింద్రేకి 50 లక్షలు ఇస్తే చాలు. ఆమె ఈ షో కోసం పని చేస్తోంది. అయితే, శిల్పా శెట్టిలా ఆమెకు డ్యాన్స్ పై పట్టు ఉందా ? అంటే లేదనే చెప్పాలి. పైగా శిల్పా శెట్టికి ఈ షో అభిమానులు బాగా అలవాటు పడ్డారు. మరి ఒకవేళ శిల్పా శెట్టి తిరిగి షోకి వస్తాను అంటే.. యాజమాన్యం ఏమి చేస్తోందో !
నిజానికి మొదట శిల్పా శెట్టి వచ్చేంతవరకు గెస్ట్ తారలతో కార్యక్రమాన్ని నడిపిస్తామని యాజమాన్యం చెప్పినప్పటికీ.. సోనాలి బింద్రే లాంటి నటీమణి షో కోసం పనిచేయడానికి ఆసక్తి చూపించడంతో సమీకరణాలు మారాయి. మరోవైపు, సోనాలి బింద్రే షో కోసం మరింత స్లిమ్ గా మారింది. పైగా సోనాలి పై సింపతీ కూడా ఉంది. క్యాన్సర్ నుండి కోలుకుని.. మళ్ళీ యాక్టివ్ కావడానికి కష్టపడుతుంది అని.
అన్నిటికీ మించి సోనాలికి 46 ఏళ్ల వచ్చినా.. ఇప్పటికీ 20 ఏళ్ల ఏజ్ ఫిజిక్ తో ఆకట్టుకుంటుంది. కాబట్టి శిల్పా స్థానాన్ని సోనాలి ఆక్రమించడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి ‘శిల్పాశెట్టి’ ఆదాయం పై సోనాలి బింద్రే కన్ను పడినట్టే.