https://oktelugu.com/

ENG vs IND: రసపట్టులో మూడవ టెస్ట్..! మూడు ఫలితాలకూ ఆస్కారం

  భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఎంతో ఆసక్తికరంగా ఆరంభమైంది. రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఈ మొదటి టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులు చేసిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ, రాహుల్ 97 పరుగుల భారీ ఓపెనింగ్ భాగస్వామ్యం ఇచ్చినప్పటికీ వెంటనే 15 పరుగుల వ్యవధిలో నాలుగు కీలక వికెట్లు కూల్చారు. ఇక మూడో రోజు ఆట మొదలయ్యే సమయానికి […]

Written By: Kusuma Aggunna, Updated On : August 7, 2021 11:56 am
Follow us on

 

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఎంతో ఆసక్తికరంగా ఆరంభమైంది. రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఈ మొదటి టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులు చేసిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ, రాహుల్ 97 పరుగుల భారీ ఓపెనింగ్ భాగస్వామ్యం ఇచ్చినప్పటికీ వెంటనే 15 పరుగుల వ్యవధిలో నాలుగు కీలక వికెట్లు కూల్చారు.

ఇక మూడో రోజు ఆట మొదలయ్యే సమయానికి రాహుల్, రిషబ్ పంత్ క్రీజ్లో ఉన్నారు. పంత్ ఎప్పటిలాగే రెచ్చిపోయి కేవలం 20 బంతుల్లో 25 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇందులో 3 ఫోర్లు ఒక సిక్సర్ ఉన్నాయి. మొదటి నుండి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న రాహుల్ ఇదే క్రమంలో అర్థ సెంచరీ సాధించాడు. అతనికి తోడైన జడేజా రాహుల్ కి చక్కటి సహకారం అందించారు. వీరిద్దరూ కలిసి ఆరవ వికెట్ కు 70 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

అయితే 12 ఫోర్లతో 84 పరుగులు చేసిన రాహుల్ భారత్కు 22 పరుగుల ఆధిక్యత ఉన్నప్పుడు వెనుదిరిగాడు. దీంతో జడేజా లోయర్ ఆర్డర్ అండగా బ్యాటు ఝళిపించక తప్పలేదు. రవీంద్ర జడేజా 86 బంతుల్లో 56 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇంకేముంది ఆధిక్యత ఇక 50 లోపే అనుకున్నారు. అయితే చివర్లో జస్ప్రీత్ బుమ్రా 3 ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో 28 పరుగులు చేయడంతో భారత జట్టు 95 పరుగుల ఆధిక్యం సాధించింది.

బదులుగా రెండవ ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. అయితే మూడవ రోజు దాదాపు నలభై ఓవర్లు ఆట వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. ముందు రోజు కూడా 30-40 ఓవర్లు వర్షం కారణంగా కోల్పోవడంతో ఇక టెస్టుల్లో రెండు రోజులే మిగిలి ఉంది.

ఈ సమయంలో రెండు జట్లు విజయం సాధించేందుకు అవకాశం ఉంది. గత రెండు రోజులు లాగానే మిగిలిన రెండు రోజులు వరుణుడు తన ప్రభావం చూపితే మ్యాచ్ డ్రాగా ముగిసిన అవకాశం కూడా ఉంది. అయితే భారత్ గెలవాలంటే ఇంగ్లాండ్ ను నాలుగో రోజు వీలైనంత త్వరగా ఆలౌటు చేసి ఒక 150 పరుగుల లోపు టార్గెట్ ఉండేలా చూసుకోవాలి. అంతకుమించి నాలుగో ఇన్నింగ్స్లో భారత్ ఛేధించడం ఈ పిచ్ పైన ఎంతో కష్టం.