Attitude Star Chandrahas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే…ఇక ఇలాంటి సందర్భంలోనే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో పాటు పోటీ పడుతూ యంగ్ హీరోలు సైతం మంచి సినిమాలను చేస్తుండటం విశేషం…ఇక కొత్త హీరోలు సైతం ఇండస్ట్రీకి వస్తున్నాడు అనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలోనే ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో మౌళి చాలా మంచి విజయాన్ని సాధించాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్న మౌళి గురించి ఇప్పుడు యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే సీరియల్స్ లో మంచి పాపులారిటి ని సంపాదించుకున్న నటుడు ప్రభాకర్… అతని కొడుకు అయిన చంద్రహాస్ గతంలో రామ్ నగర్ బన్నీ అనే ఒక సినిమా చేశాడు. ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు… అయితే అతను ‘రాంనగర్ బన్నీ’ సినిమా సమయంలో స్టేజ్ మీద కొంచెం ఆటిట్యూడ్ చూపించడంతో అతనికి ఆటిట్యూడ్ స్టార్ అనే పేరైతే పెట్టేశారు.
Also Read: ‘లిటిల్ హార్ట్స్ ‘ మూవీ డైరెక్టర్ వాళ్ల తాత కూడా దర్శకుడనే విషయం మీకు తెలుసా..?
మరి ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా ఆయన ఒక ఈవెంట్ లో పాల్గొన్నప్పుడు ఈ మధ్యకాలంలో మీకు నచ్చిన సినిమా ఏంటి అని ఒక రిపోర్టర్ క్వశ్చన్ అయితే అడిగాడు. ఇక దానికి చంద్రహాస్ సినిమాలను గుర్తు చేసుకుంటుంటే మధ్యలో ఒకాయన ‘లిటిల్ హార్ట్స్’ సినిమానా అని అడగగా ఆ సినిమా కాదు. అది నాకు పెద్దగా నచ్చలేదు అన్నట్టుగా సమాధానం అయితే చెప్పాడు…
ఇక ప్రస్తుతం దీనిమీద సోషల్ మీడియాలో పెద్ద చర్చ అయితే జరుగుతోంది. లిటిల్ హార్ట్స్ సినిమా నచ్చకపోవడమేంటి యావత్తు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ సినిమా నచ్చిందని అందుకే ఆ సినిమా రెండు కోట్లతో తీస్తే 35 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిందని కామెంట్స్ అయితే చేస్తున్నారు…
ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపు అయితే వస్తోంది. అలాంటిది మౌలికి వచ్చిన గుర్తింపును తట్టుకోలేక ఆటిట్యూడ్ స్టార్ ఆ సినిమా నచ్చలేదని చెబుతున్నాడు అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం…