Kishkindhapuri Vs Mirai: తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెల్లంకొండ శ్రీనివాస్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి ఇమేజ్ ని సంపాదించి పెట్టడమే కాకుండా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ను కూడా ఏర్పాటు చేశాయి…ఇక రాక్షసుడు సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన ఆ తర్వాత నుంచి వచ్చిన సినిమాలతో ఏమాత్రం తన ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. కారణం ఏదైనా కూడా వచ్చిన సినిమాలు వచ్చినట్టు ఫ్లాప్ అవుతున్నాయి తప్ప ఒక్క సినిమా కూడా పట్టలెక్కడం లేదు. ఇక కిష్కింధపురి సినిమాతో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ అయితే పడిపోయాయి. ఇక ప్రీమియర్స్ ని చూసిన చాలా మంది జనాలు సినిమా యావరేజ్ గా ఉందని కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇక సగటు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది గంటల పాటు వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉంది…
Also Read: ‘తెలుసు కదా ‘ టీజర్ రివ్యూ : ఇద్దరి మధ్యన నలిగిపోయిన సిద్దూ…
హనుమాన్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన తేజ ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా అవతరించాడు. ఇక ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మిరాయి అనే మరొక పాన్ ఇండియా సబ్జెక్టుని చేశాడు. మరి ఈ సినిమా రేపు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా మీద మొదటి నుంచి మంచి అంచనాలైతే ఉన్నాయి.
ముఖ్యంగా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా మీద అంచనాలు తారా స్థాయికి వెళ్లిపోయాయి. 50 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను చాలా అద్భుతంగా చూపించిన దర్శకుడికి మంచి గుర్తింపైతే వస్తుంది. మరి ఈ సినిమా టాక్ ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటల పాటు వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉంది…
‘కిష్కింద పురి’ మిరాయి రెండు సినిమాలు కూడా ఒకేరోజు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ రెండు సినిమాల మధ్య విపరీతమైన పోటీ అయితే ఉంది. మరి ఇందులో ఏ సినిమా సక్సెస్ టాక్ ను సంపాదించుకుంటుంది. ఏ సినిమా డిజాస్టర్ టాక్ ను మూట గట్టుకుంటుంది అనేదాని మీదనే సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. ఇక పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాకి మాత్రం కలెక్షన్స్ భారీగా వస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…చూడాలి మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుంది అనేది…