Prabhas In Mirai: తేజ సజ్జ(Teja Sajja) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మిరాయ్'(Mirai Movie) రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. కాసేపటి క్రితమే ముంబై లో ప్రీమియర్ షో మొదలైంది. ఈ ప్రీమియర్ షో నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. విడుదలకు ముందు థియేట్రికల్ ట్రైలర్, పాటలతో ఆడియన్స్ లో బోలెడంత హైప్ ని క్రియేట్ చేసుకుంది ఈ చిత్రం. ముఖ్యంగా మూవీ టీం చేసిన ప్రొమోషన్స్ అదుర్స్ అనే చెప్పాలి. హీరో తేజ సజ్జ దాదాపుగా 20 ఇంటర్వ్యూస్ కి పైగా ఇచ్చాడు. హిందీ వెర్షన్ కోసం ముంబై లో ఒక గ్రాండ్ ఈవెంట్ ని కూడా ఏర్పాటు చేసాడు. అంతే కాదు ఈ చిత్రాన్ని హిందీ లో విడుదల చేస్తున్న కరణ్ జోహార్ తో ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఇలా సినిమాని ఎన్ని విధాలుగా ప్రమోట్ చెయ్యాలో, అన్ని విధాలుగా ప్రమోట్ చేసాడు.
Also Read: ‘తెలుసు కదా ‘ టీజర్ రివ్యూ : ఇద్దరి మధ్యన నలిగిపోయిన సిద్దూ…
ఫలితంగా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. రేపు ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ట్రైలర్ చివర్లో మనకి శ్రీరాముడిని చూపిస్తారు గుర్తుందా?, ఆ శ్రీరాముడు క్యారక్టర్ ని చేసింది ఎవరు?, సూపర్ స్టార్ మహేష్ బాబు చేశాడా?, లేదా రెబెల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) చేశాడా అనే అనుమానాలు ఆడియన్స్ లో కలిగింది. అయితే ఆ క్యారక్టర్ ని ఎవ్వరూ చెయ్యలేదు కానీ, ఈ సినిమా లో ప్రభాస్ ప్రెజెన్స్ వాయిస్ రూపం లో కానీ, లేకపోతే చిన్న వీడియో షాట్ రూపం లో కానీ ఉంటుందని, ప్రభాస్ ఫ్యాన్స్ కి అది పెద్ద సర్ప్రైజ్ అని అంటున్నారు. ఇంతకీ ఏమిటి ఆ సర్ప్రైజ్ అనేది ఇంకా బయటకు రాలేదు.
కాసేపటి క్రితమే ఆ చిత్రం హీరో తేజ సజ్జ ట్విట్టర్ లో ఒక ట్వీట్ వేసాడు. ఆ ట్వీట్ లో ఏముందంటే ‘మరికొద్ది గంటల్లో మిరాయ్ చిత్రం మీ సొంతం కాబోతుంది. పెద్ద మనసు చేసుకొని రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఈ చిత్రాన్ని మాకు మరింత స్పెషల్ గా మార్చారు. సినిమా ప్రారంభం రెబలియస్ సర్ప్రైజ్ ని అసలు మిస్ అవ్వొద్దు’ అంటూ తేజ సజ్జ వేసిన ఈ ట్వీట్ సెన్సేషనల్ గా మారింది. కచ్చితంగా ఆ సర్ప్రైజ్ ప్రభాస్ వాయిస్ ఓవర్ అయ్యుంటుంది అంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. ప్రీమియర్ షోస్ కేవలం ఒకటి రెండు చోట్ల మాత్రమే వేశారు. భారీ లెవెల్ లో ప్లాన్ చేసి, ప్రభాస్ ప్రెజెన్స్ గురించి ముందే చెప్పి ఉండుంటే ఈ సినిమాకు ఇంకా సెన్సేషనల్ ఓపెనింగ్ వచ్చేదని అంటున్నారు.
#Mirai is all yours in few hours
Eternal gratitude to our BIG-HEARTED
SRI #Prabhas garu for making it so specialDon’t miss the REBELLIOUS SURPRISE right at the beginning
— Teja Sajja (@tejasajja123) September 11, 2025