https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: కంటెస్టెంట్స్ హుక్ స్టెప్పులు… లారెన్స్ మాస్టర్ పంచులు!

ముందుగా గంట కొట్టి హుక్ స్టెప్ వేశాడు ప్రశాంత్. ప్రశాంత్ స్టెప్ బానే ఉంది కానీ .. కింద నుంచి పైకి వెళ్ళాలి అంటూ అని లారెన్స్ చెప్పారు.ఈ స్టెప్ ఒక సారి మాస్టర్ వేస్తే చూడాలి .

Written By:
  • NARESH
  • , Updated On : November 5, 2023 / 05:43 PM IST

    Bigg Boss 7 Telugu

    Follow us on

    Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 తొమ్మిదో వారం వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఈ రోజు సన్ డే కావడంతో కంటెస్టెంట్స్ తో సరదాగా గేమ్స్ ఆడిస్తూ సందడి చేశారు. ఎపిసోడ్ గెస్ట్ లు గా రాఘవ లారెన్స్,ఎస్ జె సూర్య వచ్చారు. రాఘవ లారెన్స్ తన కొత్త సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా వచ్చారు. ఇక కంటెస్టెంట్స్ తో హుక్ స్టెప్ గెస్ చెయ్యాలంటూ గేమ్ ఆడించాడు నాగార్జున. ఇందుకు హౌస్ మేట్స్ రెండు టీమ్స్ గా డివైడ్ అయ్యారు. ముందుగా అమర్ దీప్,పల్లవి ప్రశాంత్ పోటీ పడ్డారు. వాళ్ళకి ‘దాయి దాయి.. ధామా .. కులికే కుందనాల బొమ్మ’ చిరంజీవి పాట ప్లే చేసారు.

    ముందుగా గంట కొట్టి హుక్ స్టెప్ వేశాడు ప్రశాంత్. ప్రశాంత్ స్టెప్ బానే ఉంది కానీ .. కింద నుంచి పైకి వెళ్ళాలి అంటూ అని లారెన్స్ చెప్పారు.ఈ స్టెప్ ఒక సారి మాస్టర్ వేస్తే చూడాలి .. అని డైరెక్టర్ ఎస్ జె సూర్య అన్నారు.దాంతో లారెన్స్ స్టెప్స్ వేసి అదరగొట్టారు. ఆ తర్వాత రౌండ్లో అమర్ ఇంకా గౌతమ్ పార్టిసిపేట్ చేశారు. ముందు గౌతమ్ బెల్ కొట్టాడు. కానీ స్టెప్ తప్పుగా వేశాడు. దాంతో ‘నడక కలిసిన నవరాత్రి’ పాటకు హుక్ స్టెప్ వేసి చూపించాడు అమర్ దీప్.

    ఆ తర్వాత హోస్ట్ నాగార్జున ‘మాస్టర్ నేను మీకు ఒక సూపర్ డాన్సర్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను.. తేజ ఇటు రా అని అంటారు. ఈ స్టెప్పులు మీకు బాగా ఉపయోగ పడతాయి అని నాగార్జున లారెన్స్ తో చెప్పారు. ఇక టేస్టీ తేజ ఎప్పటిలానే పంప్ స్టెప్పులు వేశాడు. డాన్స్ చేస్తూ బాడీ మొత్తం ఊపేశాడు.

    తేజ డాన్స్ చూసి ‘కింద నుంచి నీళ్లు వచ్చేస్తాయి అని పంచ్ వేశారు లారెన్స్ మాస్టర్. ఆయన కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చింది అంటూ ఎస్ జె సూర్య అన్నారు. నెక్స్ట్ ఫిల్మ్ లో ఈ మూమెంట్ యూజ్ చేసుకుంటా .. అంటూ రాఘవ లారెన్స్ జోక్ చేశారు. ప్రోమో ఎలా ముగిసింది. కాగా ఈ రోజు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఉత్కంఠగా మారింది. తాజా సమాచారం ప్రకారం టేస్టీ తేజ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది.