Radhe Shyam: “రాధేశ్యామ్” సినిమాకి జపనీస్ ఫ్రీ పబ్లిసిటీ

Radhe Shyam: బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. డార్లింగ్ నటిస్తున్న అన్ని చిత్రాలు పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న “రాధేశ్యామ్” విడుదలకు సర్వం సిద్ధం చేశారు మేకర్స్.పిరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే తన అందంతో నటనతో అలరించనుంది. […]

Written By: Raghava Rao Gara, Updated On : December 13, 2021 3:06 pm

Radhe Shyam

Follow us on

Radhe Shyam: బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. డార్లింగ్ నటిస్తున్న అన్ని చిత్రాలు పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న “రాధేశ్యామ్” విడుదలకు సర్వం సిద్ధం చేశారు మేకర్స్.పిరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే తన అందంతో నటనతో అలరించనుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్స్ ట్రీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.అయితే ఈ చిత్రం పై జపాన్ అభిమానుల ప్రభావం కూడా అధికంగా ఉందండోయ్.

బాహుబలి తర్వాత ప్రభాస్ ఫాలోయింగ్ జపాన్‌లో ఓ రేంజ్ లో ఉందంటే అతిశయోక్తి. ప్రభాస్ సినిమా విడుదలవుతుంది అంటే చాలు జపాన్ ఫ్యాన్స్ యాక్టివేట్ అయిపోతారు. తమ హీరో సినిమా వస్తోందంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటారు. అయితే అలాంటి అదృష్టమే “రాధేశ్యామ్” చిత్రానికి దక్కిందని చెప్పాలి.

“రాధేశ్యామ్” సినిమాకు జపనీస్ తమదైన స్టైల్లో పాటలు పాడుతూ.. డ్యాన్సులు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇటువంటి అరుదైన ప్రేక్షక అభిమానం ఫ్రీ పబ్లిసిటీ ప్రభాస్ సినిమాలకు దక్కటం విశేషంగానే చెప్పుకోవాలి.”రాధేశ్యామ్” సినిమాను జపనీస్ సబ్ టైటిల్స్ తో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని ప్రచార వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాతో జపాన్ మార్కెట్ లో ప్రభాస్ కాసుల వర్షం కురిపిస్తారో లేదో చూడాలి మరి.