Tollywood Heros Two Marriages:సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఎంతో ముఖ్యం అయితే కొన్ని పరిస్థితుల కారణంగా వివాహబంధంలో ఎంతో సంతోషంగా సాగిపోతున్న కొందరు కొన్ని కారణాల వల్ల విడిపోవలసి వస్తుంది. ఈ క్రమంలోనే కొందరు రెండవ పెళ్లి చేసుకుని తిరిగి వారి జీవితాన్ని కొనసాగిస్తారు. ఇక ఇలా రెండు పెళ్లిళ్లు చేసుకున్న వారిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు ఎవరు అనే విషయం గురించి ఇక్కడ తెలుసుకుందాం…
నందమూరి తారక రామారావు: ఎన్టీఆర్ 20 సంవత్సరాల వయస్సులోనే తన మేనమామ కూతురు బసవతారకంని వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు కూతుళ్లు నలుగురు కొడుకులు అయితే 1985లో బసవతారకం క్యాన్సర్ తో మృతి చెందారు. ఈమె మృతి చెందిన తర్వాత ఎన్టీఆర్ 1993లో లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నారు.
కృష్ణ: కృష్ణ విజయనిర్మల పెళ్లి చేసుకోవడానికి కన్నా ముందుగానే ఇందిరా దేవితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే నటి విజయనిర్మల తో కృష్ణ పలు చిత్రాలలో నటించడం వల్ల ఆమెతో పరిచయం ఏర్పడి తిరిగి ఆమెను పెళ్లి చేసుకున్నారు. కృష్ణ విజయనిర్మల పెళ్లి చేసుకునే సమయానికి ఆమెకు అప్పటికే పెళ్లయి ఒక కొడుకు ఉన్నారు.
కృష్ణంరాజు: కృష్ణంరాజు మొదటి భార్య పేరు సీతాదేవి ఈమె ఒక కారు యాక్సిడెంట్ లో చనిపోవడం వల్ల తిరిగి శ్యామల దేవిని పెళ్లి చేసుకున్నారు.మొదటి భార్యకు ఒక కూతురు ఉండగా తిరిగి శ్యామల దేవికి ముగ్గురు కూతుర్లు అలాగే కృష్ణం రాజు దంపతులు మరో అమ్మాయిని దత్తత తీసుకున్నారు.
నాగార్జున: సినిమాలలోకి రాకముందు నాగార్జున దగ్గుబాటి లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి నాగచైతన్య జన్మించారు అనంతరం వీరిద్దరూ విడాకులు తీసుకోవడం వల్ల నాగార్జున సినీ నటి అమలను వివాహం చేసుకున్నారు. వీరికి అఖిల్ జన్మించాడు.
మోహన్ బాబు: మోహన్ బాబు మొదటి విద్యాదేవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వీరికి మంచు విష్ణు మంచు లక్ష్మీప్రసన్న జన్మించారు.ఆమె మరణించిన తర్వాత ఆమె చెల్లెలు నిర్మల దేవిని మోహన్ బాబు రెండవ వివాహం చేసుకున్నారు వీరికి మంచు మనోజ్ జన్మించారు.

Also Read: Prabhas: ప్రభాస్ అతిధి మర్యాదకు ఫిదా అయిన మరో బాలీవుడ్ బ్యూటీ… సోషల్ మీడియాలో పోస్ట్
పవన్ కళ్యాణ్: పవన్ కళ్యాణ్ మొదటి భార్య పేరు నందిని వీరి వివాహం పెద్దలు కుదిర్చిన వివాహం.అయితే కొన్ని కారణాల వల్ల పవన్ కళ్యాణ్ నందినికి విడాకులిచ్చి రెండో వివాహం రేణుదేశాయ్ ని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఆద్య అకీరా ఉన్నారు. 2012లో వీరిద్దరు విడిపోయి పవన్ కళ్యాణ్ రష్యన్ యువతి అన్నా లెజినోవాని వివాహం చేసుకున్నారు.వీరే కాకుండా ఇంకా సీనియర్ నటులు ఎంతో మంది ఇలా రెండు పెళ్లిళ్లు చేసుకున్న వారు ఉన్నారు.
Also Read: HBD Venky: వెంకీ మామ విక్టరీ వెనక ఉన్న ఆ వ్యక్తి ఎవరో తెలుసా?