https://oktelugu.com/

Radhe Shyam: పుకార్లకు రాధేశ్యామ్ చెక్.. ప్రభాస్ టీమ్ కొత్త ప్లాన్ !

Radhe Shyam: స్టార్ హీరోలు తమకు తాము పాన్ ఇండియా స్టార్ లం అంటూ డప్పులు కొట్టుకున్నా.. నిజంగా పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ ఉన్న ఏకైక ఇండియన్ హీరో ప్రస్తుతానికి అయితే ప్రభాస్ ఒక్కడే. మరి అలాంటి ప్రభాస్ లవర్‌ బాయ్ పాత్రలో నటించిన రాధేశ్యామ్ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ పుకార్లు వినిపించాయి. కొంతమంది నెటిజన్లు ఈ వార్తను బాగా ప్రచారం చేశారు. అయితే, తాజాగా వస్తున్న ఈ వార్తలపై మూవీ డైరెక్టర్ […]

Written By:
  • Shiva
  • , Updated On : January 26, 2022 / 05:39 PM IST

    Radhe Shyam Romantic Song

    Follow us on

    Radhe Shyam: స్టార్ హీరోలు తమకు తాము పాన్ ఇండియా స్టార్ లం అంటూ డప్పులు కొట్టుకున్నా.. నిజంగా పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ ఉన్న ఏకైక ఇండియన్ హీరో ప్రస్తుతానికి అయితే ప్రభాస్ ఒక్కడే. మరి అలాంటి ప్రభాస్ లవర్‌ బాయ్ పాత్రలో నటించిన రాధేశ్యామ్ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ పుకార్లు వినిపించాయి. కొంతమంది నెటిజన్లు ఈ వార్తను బాగా ప్రచారం చేశారు.

    radhe-shyam

    అయితే, తాజాగా వస్తున్న ఈ వార్తలపై మూవీ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ట్విటర్‌లో రిపబ్లిక్ డే విషెస్ చెబుతూ.. రాధేశ్యామ్ త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కానుందని చెప్పారు. దీంతో ఈ మూవీ ఓటీటీలో విడుదల అవుతోందన్న ఊహాగానాలకు రాధాకృష్ణ కుమార్ తెరదించారు. అయితే, నెట్‌ ఫ్లిక్స్, జీ5 నుంచి రాధేశ్యామ్ కు భారీ ఆఫర్లు వచ్చాయి. భారీ మొత్తంలో అమౌంట్ ఇస్తాం అని ముందుకు రావడంతో ఓటీటీలో రిలీజ్ చేస్తారని బాగా ప్రచారం జరిగింది.

    Also Read:  షాకింగ్ : మరో స్టార్ హీరోకి కరోనా.. అందుకే షూటింగ్ ఆగిపోయిందా ?

    మొత్తమ్మీద ఆ ఓటీటీ ప్రచారానికి రాధాకృష్ణ కుమార్ ముగింపు పలికారు. ఇక ‘రాధేశ్యామ్’ సినిమాని మొదటి నుంచి ఓవర్ గా ప్రమోట్ చెయ్యట్లేదు. సినిమాలో పెద్దగా మ్యాటర్ లేదు అన్నట్టే టీమ్ ప్రమోట్ చేస్తూ వస్తుంది. ఈ సినిమా ట్రైలర్ ను చాలా సింపుల్ గా కట్ చేశారు. ప్రభాస్ స్టార్ హీరో అయినా, పాన్ ఇండియా స్టార్ హీరో అయినా కేవలం పరిపూర్ణమైన ప్రేమ కథతోనే ఈ సినిమా సాగుతుందని ఎలివేట్ చేస్తూ వస్తున్నారు.

    Radhe Shyam

    ఏది ఏమైనా, ‘రాధేశ్యామ్’ విషయంలో యువీ క్రియేషన్స్ తెలివిగా ముందుకు వెళ్తుంది. ప్రమోషన్స్ దగ్గర నుంచీ ట్రైలర్ వరకూ ఎక్కడా అంచనాలు భారీ స్థాయిలో పెరగకుండా జాగ్రత్త పడుతున్నారు. నిజానికి సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. పైగా భూకంపం, సునామీ తాలూకు అద్భుతమైన విజువల్స్ ఉన్నాయి. పైగా హాలీవుడ్ సినిమాల్లో ఉండే రేంజ్ విజువల్స్ ఉన్నాయి.

    అన్నింటికి మించి ఈ సినిమా నిర్మాణానికి కనీసం సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అలాగే హాలీవుడ్ సినిమాలకు పని చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్ నిక్ పాల్ ఈ చిత్రానికి వర్క్ చేశాడు. అయినా సినిమా పై ఓవర్ అంచనాలను ఎందుకు పెంచట్లేదు అంటే.. సినిమా రిలీజ్ అయ్యాక, ఎలాగూ సినిమా అద్భుతంగా అనిపిస్తోంది. అంచనాలు లేకుండా వెళ్లి చూస్తే. అద్భుతంగా ఉంటుందని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

    కాగా కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీస్ – టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కాగా వంశీ – ప్రమోద్ – ప్రసీద – భూషణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించారు.

    Also Read: ప్చ్.. కొరటాల టైం అసలేం బాగాలేదు !

    Tags