Pakistan: అవినీతి పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా దాని ప్రభావం ఎక్కువవుతోంది. బెర్లిన్ కు చెందిన ట్రాన్స్ ఫరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ 180 దేశాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇందులో అవినీతి సహిత దేశాల్లో పాకిస్తాన్ ప్రధానంగా ముందు వరుసలో నిలిచింది. దీంతో ఆ దేశం అవినీతిని అంతమొందించేందుకు ఏ రకమైన చర్యలు చేపట్టడం లేదని తెలుస్తోంది. ఫలితంగా పతకాల పట్టికలో అగ్రస్థానం దక్కించుకుని తానేమిటో నిరూపించుకుంటోంది.

ఇందులో 28 సీపీఐతో పాకిస్తాన్ 140వ స్థానంలో నిలిచి అన్నింటికన్నా ముందందలో నిలిచింది. దీంతో పాకిస్తాన్ లో అవినీతి రహిత చర్యలు తీసుకోవడం లేదనే విషయం తెలుస్తోంది. దీంతోనే దేశంలో అవినీతి మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోందని తెలుస్తోంది. ప్రపంచంలో 86 శాతం దేశాలు అవినీతి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని సర్వే వెల్లడిస్తోంది. 0-100 స్థానాలు కేటాయించగా పాక్ కు మెరుగైన స్థానమే లభించడం విశేషం.
Also Read: విరిసిన మన ‘పద్మాలు’: సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ ల సక్సెస్ స్టోరీ తెలుసా..?
మనదేశం 40 సీపీఐతో 85వ స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ 147వ స్తానంలో నిలిచింది. జాబితాలో 88 స్కోరుతో డెన్మార్క్, ఫిన్లాండ్, న్యూజిలాండ్ దేశాలు నిలవడం గమనార్హం. తరువాత స్థానాల్లో నార్వే, సింగపూర్, స్వీడన్ దేశాలు ఉన్నాయి. అయితే భారీ అవినీతిమయ దేశాల్లో దక్షిణ సూడాన్, సిరియా, సోమాలియా, వెనెజులా, అఫ్గాన్ ఉండటం కూడా తెలిసిందే.
ఇటీవల కాలంలో ప్రపంచ దేశాల్లో అవినీతి పెరిగిపోతోంది. ప్రతి పనికి లంచం అలవాటు అయిపోయింది. ప్రతి చిన్న పనికి సైతం చేయి చాచడం రివాజుగా మారిపోతోంది. ఫలితంగా ప్రపంచంలో అవినీతి ఊడలు కూడా పెరిగిపోతున్నాయి. అన్ని దేశాల్లో ఏదో పనికి లంచం ఇవ్వనిదే పని కావడం లేదు. దీంతో అందరు కూడా అవినీతి వటవృక్షం కింద అంటకాగిన వారే అవుతున్నారు. ఈ నేపథ్యంలో అవినీతి ఎంత మేర పేరుకుపోయినా దాన్ని అణచడం అంత సులువైన విషయం కాదన్నది మాత్రం జగమెరిగిన సత్యం.
Also Read: నా భర్త కొడతారంటూ యూపీలో మహిళా మంత్రి స్వాతి సింగ్ సంచలన వ్యాఖ్యలు