Homeఎంటర్టైన్మెంట్Navdeep: వెరైటీ గెటప్‌ లో షాక్ ఇచ్చిన నవదీప్.. లుక్ అదిరింది !

Navdeep: వెరైటీ గెటప్‌ లో షాక్ ఇచ్చిన నవదీప్.. లుక్ అదిరింది !

Navdeep: వెరైటీ గెటప్‌ లో తేనె తాగుతూ కనిపించి నవదీప్ షాక్ ఇచ్చాడు. మొత్తమ్మీద హీరో నవదీప్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశాడు. ‘లవ్‌ మౌళి’ అనే విభిన్న తరహా చిత్రంలో నవదీప్ 2.0గా పరిచయం అవుతున్నాడు. ఈ రోజు ఆయన బర్త్‌డే సందర్భంగా ‘లవ్‌మౌళి’ మోషన్ పోస్టర్‌ను రానా చేతుల మీదుగా మూవీ యూనిట్ ఆవిష్కరించింది. జడలు కట్టిన వేషంలో తేనె తాగుతూ నవదీప్ కనిపించాడు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Navdeep
Navdeep

 

కాగా హీరో నవదీప్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు. గత వారం పెళ్లి విషయంలో కూడా నవదీప్ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పెళ్లి చేసుకోవాలని నెటిజన్లు ఇచ్చిన సలహా కు హీరో నవదీప్ ఇచ్చిన కౌంటర్ అదిరిపోయింది. పైగా బాగా వైరల్ కూడా అయింది అది.

Also Read:  ప్చ్.. కొరటాల టైం అసలేం బాగాలేదు !
ఇంతకీ నెటిజన్ ఏం అన్నాడు అంటే. ‘అన్నా నీ గడ్డం తెల్లబడుతోంది. ఇక త్వరగా పెళ్లి చేసుకో అని కామెంట్స్ చేశాడు. దాంతో నవదీప్ రియాక్ట్ అవుతూ.. కొంతమంది నాకు సలహాలు ఇస్తున్నారు. గడ్డం తెల్లబడితే చేయాల్సింది ట్రిమ్మింగ్.. పెళ్లి కాదు. దురద పుడితే గోక్కుంటాం కానీ తోలు పీకేసుకోం కదా’ అని నవదీప్ ఇచ్చిన కౌంటర్ మొత్తానికి బాగా హల్ చల్ చేసింది.

ఇక ఇప్పుడు కొత్త గెటప్ తో అండ్ సెటప్ తో సోషల్ మీడియాలో ప్రస్తుతం మళ్ళీ వైరల్ గా మారాడు. అయినా దురద పుడితే గోక్కుంటాం కానీ తోలు పీకేసుకోం కదా అంటూ నవదీప్ చెప్పిన డైలాగ్ బాగా ట్రెండ్ అయింది.

Love Mouli Title Reveal | Navdeep | Pankhuri | Govind Vasantha | Avaneendra | Happy Birthday Navdeep

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

1 COMMENT

  1. […] Mega Power Star Ram Charan:  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కారణంగా మూడేళ్ళ పాటు డేట్లు అన్ని ఆ సినిమాకే ఇచ్చేశాడు. మధ్యలో ఆచార్యలో గెస్ట్ రోల్ లో నటించినా అది కేవలం నాలుగు నిమిషాల పాత్ర మాత్రమే. అయితే, చరణ్ మొత్తానికి మూడేళ్ళ తర్వాత ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల నుంచి బయటకు వచ్చి.. శంకర్ తో మరో సినిమాకు సిద్ధం అయ్యాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయాలని చరణ్ ప్లాన్ చేస్తున్నాడట. […]

Comments are closed.

Exit mobile version