https://oktelugu.com/

Radhe Shyam Movie Release: ఆ విష‌యంలో భ‌య‌ప‌డి వెన‌క్కి త‌గ్గిన రాధేశ్యామ్.. అస‌లు కార‌ణం ఇదే

Radhe Shyam Movie Release: ఇప్పుడు ఎక్క‌డ చూసినా రాధేశ్యామ్ హ‌వానే క‌నిపిస్తోంది. మార్చి 12న మూవీ రిలీజ్ కానుండ‌టంతో.. ప్ర‌మోష‌న్లు, ఇంట‌ర్వ్యూలు, అప్ డేట్ల‌తో రాధేశ్యామ్ టీమ్ హోరెత్తిస్తుంది. రోజుకో కొత్త వార్త ఈ మూవీ గురించి వినిపిస్తోంది. క్లైమాక్స్ అలా ఉంటుంద‌ని, క‌థ ఇలా ఉంటుంద‌ని, బ‌డ్జెట్ అంత‌ని, ఇంత‌ని.. ఇలా ఎన్నో వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి ఈ మూవీ గురించి. కాగా రోజుకో కొత్త వార్త వ‌స్తూ.. మూవీపై భారీ అంచ‌నాలు పెంచేస్తున్నాయి. […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 9, 2022 / 04:21 PM IST
    Follow us on

    Radhe Shyam Movie Release: ఇప్పుడు ఎక్క‌డ చూసినా రాధేశ్యామ్ హ‌వానే క‌నిపిస్తోంది. మార్చి 12న మూవీ రిలీజ్ కానుండ‌టంతో.. ప్ర‌మోష‌న్లు, ఇంట‌ర్వ్యూలు, అప్ డేట్ల‌తో రాధేశ్యామ్ టీమ్ హోరెత్తిస్తుంది. రోజుకో కొత్త వార్త ఈ మూవీ గురించి వినిపిస్తోంది. క్లైమాక్స్ అలా ఉంటుంద‌ని, క‌థ ఇలా ఉంటుంద‌ని, బ‌డ్జెట్ అంత‌ని, ఇంత‌ని.. ఇలా ఎన్నో వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి ఈ మూవీ గురించి.

    Prabhas Radhe Shyam

    కాగా రోజుకో కొత్త వార్త వ‌స్తూ.. మూవీపై భారీ అంచ‌నాలు పెంచేస్తున్నాయి. ఈ మూవీ క్లైమాక్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంద‌ని ప్ర‌భాస్ స్వ‌యంగా చెప్పేయ‌డంతో.. అభిమానులు ఆకాశంలో తేలిపోతున్నారు. పైగా దీని క‌థ మొత్తం ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఉంటుంద‌ని, మూవీలో మొత్తం ట్విస్టులే ఉంటాయ‌ని అనేక పుకార్లు అభిమానుల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

    Also Read: వైరల్ అవుతున్న టుడే మూవీ అప్ డేట్స్

    ఇక సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గానే వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు. కాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీకి ముందు రోజు రాత్రి పెయిడ్ ప్రిమియర్స్ వేస్తార‌నే ప్ర‌చారం నిన్న‌టి నుంచి జ‌రుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్ లో బాహుబలి-2తో పాటు అర్జున్ రెడ్డి లాంటి కొన్ని సినిమాల‌కే ఇలా రిలీజ్ కంటే ఒక రోజు ముందు సెకండ్ షోల నుంచి పెయిడ్ ప్రీమియర్స్ వేయడం జ‌రిగింది. కాగా ఇప్పుడు రాధే శ్యామ్ కూడా ఈ లిస్టులో చేరుతుంద‌ని అంతా అనుకున్నారు.

    Radhe Shyam

    అయితే ఈ ఆలోచ‌న‌లో ఉండ‌గానే.. కొంద‌రు సినీ ప్ర‌ముఖుల కోసం స్పెష‌ల్ షో వేయించి వారికి చూయించారంట‌. దీన్ని చూసిన వారు.. మూవీ బాగుందని చెప్పారంట‌. కానీ కమర్షియల్ సక్సెస్ అనుమాన‌మే అని చెప్ప‌డంతో పాటు.. ప్రిమియ‌ర్స్ షోలు వ‌ద్ద‌ని, ఎందుకంటే మొద‌టి రోజు చూసిన వారు.. రెండో రోజు వ‌ర‌కే టాక్‌ను మార్చేయ‌వ‌చ్చ‌ని, త‌ద్వారా డివైడ్ టాక్ వ‌చ్చే ప్ర‌మాదం ఉంటుంద‌ని స‌ల‌హాలు ఇచ్చారంట‌. ఈ కార‌ణంగానే ప్రిమియర్స్ షోలు వ‌ద్ద‌ని మూవీ టీమ్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అందుకే పెయిడ్ ప్రిమియర్స్ షోలు క్యాన్సిల్ చేసుకున్నారంట‌.

    Also Read: టాలీవుడ్ కి బ్రాండ్ అంబాసిడర్స్ గా మోడీ – కేసీఆర్ !

    Tags