Ravi Teja Ramarao On Duty Movie: శరవేగంగా టాకీ పార్ట్ పూర్తి చేసిన ‘రామారావు’

Ravi Teja Ramarao On Duty Movie: వరుస సినిమాల్లో నటిస్తూ మాస్ మహారాజ్ రవితేజ ఫుల్ జోరుమీద ఉన్నాడు. కాగా రవితేజ హీరోగా డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ టాకీ భాగం పూర్తైందని మూవీ యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో 2 పాటల్ని తెరకెక్కించేందుకు టీమ్ స్పెయిన్‌ కి వెళ్లినట్లు పేర్కొంది. ఈ పాటలతో చిత్రీకరణ పూర్తవుతుందని వెల్లడించింది. […]

Written By: Shiva, Updated On : March 9, 2022 4:15 pm
Follow us on

Ravi Teja Ramarao On Duty Movie: వరుస సినిమాల్లో నటిస్తూ మాస్ మహారాజ్ రవితేజ ఫుల్ జోరుమీద ఉన్నాడు. కాగా రవితేజ హీరోగా డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ టాకీ భాగం పూర్తైందని మూవీ యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో 2 పాటల్ని తెరకెక్కించేందుకు టీమ్ స్పెయిన్‌ కి వెళ్లినట్లు పేర్కొంది. ఈ పాటలతో చిత్రీకరణ పూర్తవుతుందని వెల్లడించింది.

Ramarao On Duty

ఇక యధార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందిస్తున్నట్లు వివరించింది టీమ్. ఈ సినిమా హిందీ స్ట్రీమింగ్ రైట్స్‏ను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘సోనీ లీవ్’ భారీ ధరకు సొంతం చేసుకుంది. అన్నట్టు రామారావు ఆన్‌ డ్యూటీ సినిమా టీజర్ మహాశివరాత్రిని పురస్కరించుకొని విడుదల అయి మంచి ఆదరణ పొందింది. ఇటీవల పోలీస్‌ చిత్రాలు హిట్ కొడుతుండగా, రామారావు ఆన్‌ డ్యూటీ కూడా విక్రమార్కుడు తరహాలో హిట్టవుతుందని భావిస్తున్నారు.

Also Read: టాలీవుడ్ కి బ్రాండ్ అంబాసిడర్స్ గా మోడీ – కేసీఆర్ !

ఏది ఏమైనా మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ పోవడంతో కొత్త దర్శకులు అందరూ ఇప్పుడు రవితేజ చుట్టూ తిరుగుతున్నారు. కథ నచ్చితే.. వెంటనే ఛాన్స్ ఇవ్వడానికి రవితేజ ముందుకు ఉత్సాహంగా ఉంటాడు. అన్నట్టు రవితేజ ‘ధమాకా’ విషయానికి వస్తే.. త్రినాథ్ రావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను.. టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Ramarao On Duty

కాగా రవితేజ 69వ చిత్రంగా ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ అట, ముఖ్యంగా సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ ఫుల్ కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ఉంటుందట. చిరు ‘చంటబ్బాయి’ సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా ఉండబోతుందని తెలుస్తోంది.

ఎలాగూ త్రినాథరావ్ నక్కిన కూడా మంచి కామెడీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి.. తన గత చిత్రాలు ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్’ సినిమాల శైలిలోనే నక్కిన ఈ సినిమాని కూడా మలచబోతున్నాడు.

Also Read:  పవన్ తో సినిమా పై పూజా హెగ్డే రియాక్షన్ ఇదే

Tags