Twitter CEO Indian: ట్విట్టర్ కు మనోడే.. ప్రపంచ టెక్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన భారతీయులు వీళ్లే..

Twitter CEO Indian: ప్రపంచం టెక్నాలజీతో పరుగులు పెడుతోంది. ప్రతీ రంగం సాంకేతికతతో ముడిపడి ఉంది. అనేక దేశాలు టెక్నాలజీ ఆధారంగానే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే అలాంటి టెక్ ప్రపంచాన్ని తయారు చేయడంలో భారతీయుల భాగం ఉందంటే గర్వించదగ్గ విషయమే. ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీలపై భారతీయులు ఆధిపత్యాన్ని సాధించడం ఇక్కడి ప్రతిభకు నిదర్శనం. గూగుల్, మైక్రో సాఫ్ట్ ఇలా ఎలాంటి టెక్ దిగ్గజ కంపెనీలైనా వాటిలో ఇండియన్ ప్రతిభ ఇమిడి ఉంది. ఇప్పటి వరకు […]

Written By: NARESH, Updated On : November 30, 2021 11:51 am
Follow us on

Twitter CEO Indian: ప్రపంచం టెక్నాలజీతో పరుగులు పెడుతోంది. ప్రతీ రంగం సాంకేతికతతో ముడిపడి ఉంది. అనేక దేశాలు టెక్నాలజీ ఆధారంగానే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే అలాంటి టెక్ ప్రపంచాన్ని తయారు చేయడంలో భారతీయుల భాగం ఉందంటే గర్వించదగ్గ విషయమే. ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీలపై భారతీయులు ఆధిపత్యాన్ని సాధించడం ఇక్కడి ప్రతిభకు నిదర్శనం. గూగుల్, మైక్రో సాఫ్ట్ ఇలా ఎలాంటి టెక్ దిగ్గజ కంపెనీలైనా వాటిలో ఇండియన్ ప్రతిభ ఇమిడి ఉంది. ఇప్పటి వరకు గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ అధినేతగా సత్యనాదేళ్ల నియామకమయ్యారు. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కంపెనీ సీఈవోగా భారత్ కు చెందిన పరాగ్ అగర్వాల్ ఎంపిక కావడంతో దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.

Twitter CEO Indian

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సీఈవోగా భారత సంతతి వ్యక్తి పరాగ్ అగర్వాల్ ఎంపిక కావడంతో అయనకు దేశం నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 2005లో ముంబయ్ ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో ఇంజినీరింగ్  పూర్తి చేసిన పరాగ్ ఆ తరువాత 2011లో పీహెచ్ డీ పూర్తి చేశారు. ఈ సమయంలో మైక్రోసాప్ట్, ఏటీ అండ్ టీ ల్యాబ్స్, యాహూలలో రీసెర్చ్ చేశారు. ఇదే సంవత్సరం ట్విట్టర్ కంపెనీలో సాప్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగంలో చేరారు. 2018లో ట్విటర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా నియమితులయ్యారు. పదేళ్లపాటు ట్వట్టర్లో పనిచేస్తున్న ఆయన ట్విట్టర్ టెక్నికల్ స్ట్రేటజీ, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో కంజ్యూమర్, రెవెన్యూ సైన్స్ టీమ్స్ ల బాధ్యతలు చూస్తున్నారు. అయితే ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సీఈవో బాధ్యతల నుంచి తాజాగా తప్పుకొంటున్నట్లు ప్రకటించడంతో ఆయన స్థానంలో పరాగ్ అగర్వాల్ కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. పదేళ్ల కాలంలో ఆయన ఉన్నత స్థానాన్ని అధిరోహించడం విశేషం.

ఇక భారత్ కు చెందిన సత్య నాదేళ్ల సైతం ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్నారు. 2014 ఫిబ్రవరి 4న నియమితులైన సత్య నాదేళ్ల అంతకుముందు మైక్రోసాఫ్ట్ లో క్లౌడ్ అండ్ ఎంటర్ ప్రైజేస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన సత్యనాదెళ్ల తండ్రి 1962 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. 2004 నుంచి 2009 వరకు ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రణాళిక సంఘం సభ్యునిగా ప్రధానమంత్రి కార్యదర్శిగా సత్యనాదెళ్ల తండ్రి పనిచేశారు. 1992లో మైక్రోసాప్ట్ లో సత్యనాదెళ్ల అడుగుపెట్టారు. ఆ తరువాత కంపెనీనీ ఐదేళ్లలోనే రూ.9వేల కోట్ల నుంచి రూ. 31 వేల కోట్ల కు చేర్చారు. కొత్త సవాళ్లను స్వీకరిస్తూ పదేళ్లలోనే కంపెనీని ఉన్నత స్థానానికి తీసుకెళ్లారు.

అడోబ్ కంపెనీ అధినేతగా శంతన్ నారాయణ్ హైదరాబాద్ కు చెందిన వ్యక్తే. ఇక్కడి పబ్లిక్ స్కూళ్లో చదివిన శంతన్ 1998లో అడోబ్ లో ఇంజనీరింగ్ టెక్నాలజీ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ గా, జనరల్ మేనేజర్ గా చేరారు. ఆ తరువాత 2007లో సీఈవో, 2017లో బోర్డు చైర్మన్ అయ్యాడు. శంతన్ యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పర్టనర్ షిప్ ఫోరమ్ కి వైస్ చైర్మన్, ఫైజర్ బోర్డులో మెంజర్ గా కూడా ఉన్నాడు.

Also Read: జట్టులో ఉండేదెవరో తేలేది నేడే..!

ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి కలిగిన ఐబీఎం బిజినెస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సీఈవోగా భారత్ కు చెందిన అరవింద్ కృష్ణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1990లో ఐబీఎంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన అరవింద్ ఐబీఎం క్లౌడ్, కాగ్నిటివ్ సాఫ్ట్ వేర్, ఐబీఎం రీసెర్చ్ విభాగాలను నిర్వహించాడు. 2015లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గాపదోన్నతి పొందాడు. ఏప్రిల్ 2020 నుంచి ఆయన సీఈవోగా ఉన్నారు. 2021 జనవరిలో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు.

ఇలా ట్విట్టర్ సీఈవోగానే పరాగ్ అగర్వాల్ నియామకంతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలకు భారతీయులే నిర్వహిస్తున్నట్టు అయ్యింది. ఈ ఘనత సాధించిన ఏకైక దేశం మనదే. మనవాళ్ల ప్రతిభకు ఇదీ గీటురాయిగా చెప్పొచ్చు.

Also Read: బుద్ధుడి తలపై నత్తలు ఎందుకు మరణించాయి..? ఆ కథేంటి..? సంచలన విషయాలివీ