https://oktelugu.com/

Radhe Shyam Worldwide Box Office Collection: ‘రాధేశ్యామ్’ సెకండ్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్

Radhe Shyam Worldwide Box Office Collection: నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ పాన్ ఇండియా సినిమా ‘రాధేశ్యామ్’ చిత్రం విడుదలైంది. మరి, భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రాధేశ్యామ్’ అమెరికా బాక్సాఫీస్ నుంచి లేటెస్ట్‌గా కలెక్షన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. యూఎస్‌లో తొలిరోజు యూఎస్ బాక్సాఫీస్ వద్ద ‘రాధేశ్యామ్’ 11,19,000 డాలర్ల వసూళ్లను సాధించింది. ఇక రెండో రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా ? ‘రాధేశ్యామ్’ సినిమా యుఎస్ లో రెండో రోజు కూడా […]

Written By:
  • Shiva
  • , Updated On : March 12, 2022 / 04:03 PM IST
    Follow us on

    Radhe Shyam Worldwide Box Office Collection: నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ పాన్ ఇండియా సినిమా ‘రాధేశ్యామ్’ చిత్రం విడుదలైంది. మరి, భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రాధేశ్యామ్’ అమెరికా బాక్సాఫీస్ నుంచి లేటెస్ట్‌గా కలెక్షన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. యూఎస్‌లో తొలిరోజు యూఎస్ బాక్సాఫీస్ వద్ద ‘రాధేశ్యామ్’ 11,19,000 డాలర్ల వసూళ్లను సాధించింది. ఇక రెండో రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా ? ‘రాధేశ్యామ్’ సినిమా యుఎస్ లో రెండో రోజు కూడా దాదాపు 08,19,000 డాలర్ల వసూళ్లు చేసిందని తెలుస్తోంది. యూఎస్ కలెక్షన్స్ లో ఈ ఫిగర్ కొత్త రికార్డ్ అని చెప్పాలి.

    Radhe Shyam Worldwide Box Office Collection

    ప్రభాస్.. ఈ పేరు వింటేనే చాలు ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయి. అలాంటి హీరో సినిమా అంటే.. అది అమెరికా అయినా, అనకాపల్లి అయినా ఫ్యాన్స్ కు అదో పెద్ద పండుగే. ప్లేస్ ఎక్కడైనా ఆడియన్స్ ఎవరైనా థియేటర్స్ వద్ద కోలాహలం మొదలైంది. చాలా మంది ఫస్ట్ డే మూవీ చూసేందుకు ఎగబడ్డారు. మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఇక తిరుగు లేదనే చెప్పాలి. ఈ చిత్రం దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకుంది.

    Also Read:  నేను చేసినవన్నీ మర్చిపోయారు – సమంత

    ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏకకాలంలో విడుద‌లైన ఈ సినిమాకు ఆడియెన్స్‌ లో మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ ను బట్టి ట్రేడ్ వ‌ర్గాలు వెల్లడించిన స‌మాచారం ప్రకారం ‘రాధేశ్యామ్’ సినిమాకు తొలిరోజు రూ.134.6 కోట్లు గ్రాస్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయని తెలుస్తోంది. ఇక రెండో రోజు కూడా దాదాపు 78 కోట్లు గ్రాస్ క‌లెక్ష‌న్స్ వచ్చాయట.

    Radhe Shyam Worldwide Box Office Collection

    తెలంగాణ‌లో రూ.14.1కోట్లు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రూ.32.2 కోట్లు, క‌ర్ణాట‌క‌లో రూ.09.9 కోట్లు, త‌మిళ‌నాడు రూ.3.8 కోట్లు, కేర‌ళ రూ.1.8 కోట్లు రాగా హిందీ వెర్షన్‌ లో ‘రాధేశ్యామ్’ 33.6కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ు రాబట్టిందని తెలుస్తోంది. ఇక షేర్ కలెక్షన్స్ పరంగా చూస్తే.. ‘రాధేశ్యామ్’ రెండో రోజు రూ.48.1కోట్లు కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

    Also Read:  వైరల్ అవుతున్న టుడే మూవీ అప్ డేట్స్

    Tags