https://oktelugu.com/

Radhe Shyam Movie Bollywood Rating: ‘రాధేశ్యామ్’కి రేటింగ్స్ దారుణంగా ఇచ్చారట

Radhe Shyam Movie Bollywood Rating: ‘రాధేశ్యామ్’ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమా పై చాలా హైప్ వచ్చింది. అయితే, ఆ హైప్ ను అందుకోలేకపోయాడు అంటూ కామెంట్స్ వినిపించాయి. కాగా కొంతమంది బాలీవుడ్ క్రిటిక్స్ పనిగట్టుకుని తెలుగు చిత్రాలకు నెగిటివ్ రేటింగ్స్ ఇస్తున్నారు అని, పుష్పను ఇలానే అణచివేయాలనుకుంటే బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచింది అని, రాధేశ్యామ్‌కు కూడా మరీ దారుణంగా 1.5, 2 రేటింగ్స్ ఇచ్చారని ప్రభాస్ సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే […]

Written By:
  • Shiva
  • , Updated On : March 12, 2022 / 04:10 PM IST
    Follow us on

    Radhe Shyam Movie Bollywood Rating: ‘రాధేశ్యామ్’ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమా పై చాలా హైప్ వచ్చింది. అయితే, ఆ హైప్ ను అందుకోలేకపోయాడు అంటూ కామెంట్స్ వినిపించాయి. కాగా కొంతమంది బాలీవుడ్ క్రిటిక్స్ పనిగట్టుకుని తెలుగు చిత్రాలకు నెగిటివ్ రేటింగ్స్ ఇస్తున్నారు అని, పుష్పను ఇలానే అణచివేయాలనుకుంటే బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచింది అని, రాధేశ్యామ్‌కు కూడా మరీ దారుణంగా 1.5, 2 రేటింగ్స్ ఇచ్చారని ప్రభాస్ సన్నిహితులు చెబుతున్నారు.

    Radhe Shyam Movie Bollywood Rating

    ఇప్పటికే ‘రాధేశ్యామ్’ మొదటి రోజు వసూళ్లు అదిరిపోయాయి. నూన్, ఈవెనింగ్ షోస్‌పై క్రిటిక్స్ ప్రభావం పడలేదు. రానున్న రోజుల్లో చిత్రం పుంజుకుంటుంది అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఏది ఏమైనా ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా పై నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారు. సినిమాలో మాస్ కి సంబంధించి అదనపు హంగులు మిస్ అయ్యాయి అని, పైగా మేకర్స్ ఈ సినిమాని ఎమోషన్స్ తో నింపేశారు అని కామెంట్స్ వినిపించాయి.

    Also Read:  బాలీవుడ్ లేటెస్ట్ క్రేజీ అప్ డేట్స్ !

    అయితే, ఒక్కటి మాత్రం నిజం. హాలీవుడ్ మేకర్స్ రేంజ్ లో ‘రాధేశ్యామ్’ చేశాము అని బిల్డప్ ఇచ్చారు తప్ప, అందులో ఎలాంటి వాస్తవం లేదు. సింపుల్ గా చెప్పాలంటే.. సినిమాలో విజువల్స్ బాగున్నా.. సోల్ మిస్ అయ్యింది. ప్రభాస్ – పూజా పాత్రల మధ్య కెమిస్ట్రీ ఉన్నా ప్రేమ మిస్ అయ్యింది.

    దీనికితోడు హాలీవుడ్ మేకర్స్ కూడా షాక్ అయ్యేలా.. మా సినిమా భారీ స్థాయిలో ఉంటుంది అంటూ ఈ సినిమా మేకర్స్ చెప్పిన మాటలకు, సినిమాలోని, సాంకేతిక వర్గం పనితనానికి పొంతన లేకుండా పోయింది. భారీ బడ్జెట్ తో రూపొందింది అని పేరే గానీ, సినిమాలో ఒక్క క్లైమాక్స్ కి తప్ప ఇక దేనికి బడ్జెట్ పెట్టలేదు.

    Radhe Shyam Movie Bollywood Rating

    సినిమా చూసి ప్రేక్షకులు విజిల్స్ తో కేకలతో ఊగిపోవాలని ఎంత ప్రయత్నం చేసినా.. ఆ ఊపు మాత్రం రాలేదు. ప్రేక్షకుల్లో ఎక్కువమంది పంచుకున్న అభిప్రాయం ప్రకారం.. ‘రాధేశ్యామ్’ బోరింగ్ ప్లేతో సాగే లాజిక్ లెస్ లవ్ డ్రామా. మొత్తానికి ప్రపంచస్థాయి సినిమా అంటూ వచ్చి.. దిగువస్థాయి సినిమా అయిపోయింది.

    Also Read:  నేను చేసినవన్నీ మర్చిపోయారు – సమంత

    Tags