https://oktelugu.com/

Bollywood Latest Updates: బాలీవుడ్ లేటెస్ట్ క్రేజీ అప్ డేట్స్ !

Bollywood Latest Updates: బాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీతో ఫామ్‌లోకి వచ్చిన అఖిల్ ఆ సక్సెస్‌ను కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. కాగా అఖిల్, బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్నట్లు టాక్. అయితే ఈ సినిమాలో అఖిల్‌కు జోడిగా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేసినట్లు దానికి ఆమె సానుకూలంగా స్పందించిందని […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 12, 2022 / 03:57 PM IST
    Follow us on

    Bollywood Latest Updates: బాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీతో ఫామ్‌లోకి వచ్చిన అఖిల్ ఆ సక్సెస్‌ను కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. కాగా అఖిల్, బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్నట్లు టాక్. అయితే ఈ సినిమాలో అఖిల్‌కు జోడిగా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేసినట్లు దానికి ఆమె సానుకూలంగా స్పందించిందని సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

    Akhil, Janhvi Kapoor

    ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. బాలీవుడ్ నటి యామీ గౌతమ్ తాజా చిత్రం ‘ఏ థర్స్‌డే’ మంచి విజయాన్ని సాధించింది. ఇందులో లైంగిక వేధింపులకు గురైనా బాధితురాలి పాత్రలో ఆమె నటించి మెప్పించింది. తాజాగా యామీ గౌతమ్‌ ఢిల్లీ మహిళా కమిషన్‌ కార్యాలయానికి వెళ్లింది. ఆమెతోపాటు సినిమాలో తనతో నటించిన హీరోయిన్‌ నేహా ధూపియా కూడా ఉంది. కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌‌ను కలిసి ఢిల్లీలో మహిళల భద్రత, భరోసా చర్యల గురించి తెలుసుకున్నారు.

    A Thursday

    ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. హ్యాపీడేస్ హీరో వరుణ్ సందేశ్ పాన్ ఇండియా మూవీలో ఆఫర్ కొట్టేశాడు. సందీప్ కిషన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మైఖేల్’ సినిమాలో వరుణ్ సందేశ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. కాగా ఈ సినిమాలో దివ్యాంశ హీరోయిన్‌గా నటిస్తుంది.

    Varun Sandesh

    Also Read: Victory Venkatesh: వెంకటేశ్ వ్యక్తిగత జీవితం గురించి తెలుసా?

    ఇంకో అప్ డేట్ ఏమిటి అంటే.. తనకు 2011లో యశ్ రాజ్ ఫిలింస్‌లో హీరోయిన్‌గా నటించమని ఆఫర్ వచ్చిందని, దానిని తాను తిరస్కరించానని నటి అమృతా రావు వెల్లడించింది. సినిమాలో ముద్దు సన్నివేశాలతో పాటు ఇంటిమేట్ సీన్స్ ఉంటాయని, అవి చేయడానికి సిద్ధంగా ఉన్నారా..? అని చిత్ర నిర్మాత ఆదిత్య చోప్రా తనను అడిగారని అమృత చెప్పింది.

    Also Read: Rashmi Gautam: క్యాస్టింగ్ కౌచ్ పై గళమెత్తిన రష్మీ గౌతమ్

    Tags