Radhe Shyam Movie Business: ’రాధేశ్యామ్’కి బిజినెస్ ఎంత జరిగిందో తెలుసా ?

Radhe Shyam Movie Business: ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ సినిమాలకు ప్రీరిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతుంది. పైగా పాన్ ఇండియా స్టార్ అయ్యాక ప్రభాస్ సినిమా కోసం.. యావత్ భారతీయ సినీ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఆతృత నడుమ భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న ‘రాధే శ్యామ్’ కోసం బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకు బిజినెస్ జరిగింది. దాదాపు 250 కోట్ల రూపాయలు వెచ్చించి అత్యంత గ్రాండ్‌ గా ఈ చిత్రాన్ని […]

Written By: Shiva, Updated On : March 9, 2022 12:48 pm
Follow us on

Radhe Shyam Movie Business: ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ సినిమాలకు ప్రీరిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతుంది. పైగా పాన్ ఇండియా స్టార్ అయ్యాక ప్రభాస్ సినిమా కోసం.. యావత్ భారతీయ సినీ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఆతృత నడుమ భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న ‘రాధే శ్యామ్’ కోసం బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకు బిజినెస్ జరిగింది.

Radhe Shyam Movie Business

దాదాపు 250 కోట్ల రూపాయలు వెచ్చించి అత్యంత గ్రాండ్‌ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. 400 కోట్ల వరకు ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. పైగా ప్రభాస్‌ కి ఉన్న రేంజ్ కారణంగా థియేట్రికల్ రైట్స్ కోసం పలు సంస్థలు పోటీపడ్డాయి. మొత్తానికి ‘రాధే శ్యామ్’ రిలీజ్‌కి ముందే నిర్మాతలకు లాభాల పంట పండింది.

ఇక ఏపీ, తెలంగాణలో ఏరియాల వైజ్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం.

నైజాం: 41.00 కోట్లు

సీడెడ్: 23.00 కోట్లు

ఉత్తరాంధ్ర: 15.50 కోట్లు

ఈస్ట్: 7.50 కోట్లు

వెస్ట్: 7.60 కోట్లు

గుంటూరు: 9.20 కోట్లు

కృష్ణా: 9.00 కోట్లు

నెల్లూరు: 5.20 కోట్లు

ఏపీ + తెలంగాణలో అన్నీ ఏరియాలు కలుపుకుని ఈ సినిమాకి 128.00 కోట్లు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది.

Radhe Shyam

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ‘రాధే శ్యామ్’కి రూ.128.50 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరగడం నిజంగా విశేషమే. ఈ పీరియాడికల్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే జంటగా నటిస్తోంది. విక్ర‌మాదిత్య అనే హ‌స్త సాముద్రికా నిపుణుడిగా విలక్షణ పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు.

Tags