https://oktelugu.com/

Radhe Shyam- SS Thaman: ‘రాధేశ్యామ్’ నెగిటివ్ టాక్ పై థమన్ సెటైర్లు

Radhe Shyam- SS Thaman: రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ డమ్ ఏంటో బాక్సాఫీస్ వద్ద ‘రాధేశ్యామ్’ ద్వారా మరోసారి ఘనంగా రుజువు అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ.. ప్రభాస్ కొత్త రికార్డులను సెట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాతో తానూ బాక్సాఫీస్ కింగ్ ను అని ప్రభాస్ నిరూపించారు. అయితే, ఈ సినిమా పై కొన్ని చోట్ల బాగా నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా మ్యూజిక్ పై […]

Written By:
  • Shiva
  • , Updated On : March 12, 2022 / 04:26 PM IST
    Follow us on

    Radhe Shyam- SS Thaman: రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ డమ్ ఏంటో బాక్సాఫీస్ వద్ద ‘రాధేశ్యామ్’ ద్వారా మరోసారి ఘనంగా రుజువు అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ.. ప్రభాస్ కొత్త రికార్డులను సెట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాతో తానూ బాక్సాఫీస్ కింగ్ ను అని ప్రభాస్ నిరూపించారు. అయితే, ఈ సినిమా పై కొన్ని చోట్ల బాగా నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా మ్యూజిక్ పై కూడా బాగా బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి.

    Radhe Shyam- SS Thaman

    ఇందులో భాగంగానే ఈ పాన్ ఇండియా మూవీ బాగా స్లో నెరేషన్‌గా ఉందని కామెంట్లు వస్తున్నాయి. దీనిపై సంగీత దర్శకుడు తమన్‌ స్పందిస్తూ.. ‘స్లో అంట.. నువ్వు పరిగెత్తించాల్సింది’ అంటూ కౌంటర్ వేశాడు. అలాగే తనను ఆకట్టుకున్న మీమ్‌ను పోస్టు చేశాడు. ఇందులో సినిమా చాలా స్లోగా ఉందని అంటే.. లవ్ స్టోరీ అంటే స్లోగా కాకుండా ఫస్ట్ హాఫ్‌ లో ఫస్ట్ నైట్ సెకండ్ హాఫ్‌లో సెకండ్ సెటప్ పెట్టాలా ఏంటి ? అని ఉంది.

    Also Read:  ‘రాధేశ్యామ్’కి రేటింగ్స్ దారుణంగా ఇచ్చారట

    మొత్తానికి ‘రాధేశ్యామ్’ బ్యాడ్ టాక్ పై చాలా రకాలుగా మీమ్స్ చేసి వదులుతున్నారు గాసిప్ రాయుళ్లు. మరోపక్క ఇప్పటికే ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున సినిమా పై తమ ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు. చిరంజీవి కూడా తన ఫ్యామిలీతో ‘రాధేశ్యామ్’ సినిమాను వీక్షించారు. అనంతరం తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ.. ‘రాధేశ్యామ్’ తిరుగులేని విజయం అందుకున్నందుకు నా హృదయపూర్వక అభినందనలు.

    Radhe Shyam- SS Thaman

    నిజంగా ఇది ప్రభాస్ స్టార్ డమ్ కి కొలమానమే. అందరూ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు ఫైనల్ గా బాక్సాఫీస్ సౌండ్ అదిరిపోయింది’ అంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు. మొత్తమ్మీద ప్రభాస్ కి ఇండస్ట్రీ నుంచి ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది. సినిమా ఎలా ఉన్నా అద్భుతం అంటూ ‘రాధేశ్యామ్’ను బాగా ప్రమోట్ చేస్తున్నారు.

    ఇక కలెక్షన్స్ విషయంలో కూడా ఈ సినిమాకి బెటర్ కలెక్షన్సే వస్తున్నాయి. మరి ఈ సినిమా చివరకు ఏ రేంజ్ కలెక్షన్స్ దగ్గర ఆగుతుందో చూడాలి. ఒక్కటి మాత్రం నిజం, ఈ సినిమా ఏవరేజ్ గానే ఉంది. ప్రభాస్ స్థాయి సినిమా కాదు అని చాలా స్పష్టంగా అర్థం అవుతుంది.

    Also Read:  బాలీవుడ్ లేటెస్ట్ క్రేజీ అప్ డేట్స్ !

    Tags