https://oktelugu.com/

Radhe Shyam: రిలీజ్ కి ముందే రికార్డులు బద్దలు కొడుతున్న ప్రభాస్

Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన ‘రాధేశ్యామ్’.. మార్చి 11న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన పాట‌లు, ట్రైల‌ర్ మూవీపై అంచ‌నాలు పెంచుతున్నాయి. ఈ మూవీకి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ ఐమాక్స్‌లో 90 శాతం టికెట్లు అమ్ముడుపోయాయి. సినిమా విడుద‌ల‌కు 20 రోజులు ఉండ‌గానే టికెట్లు భారీగా బుక్ అవ్వడంపై చిత్ర యూనిట్ హ‌ర్షం వ్య‌క్తం చేసింది. కాగా ఇన్నిరోజుల ముందే ఇంత మొత్తం టికెట్లు అమ్ముడ‌వ‌డం ఇదే మొద‌టిసార‌ట‌. ఇక ఈ సినిమా ఫస్ట్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 22, 2022 / 12:15 PM IST

    RadheShyam New Poster

    Follow us on

    Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన ‘రాధేశ్యామ్’.. మార్చి 11న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన పాట‌లు, ట్రైల‌ర్ మూవీపై అంచ‌నాలు పెంచుతున్నాయి. ఈ మూవీకి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ ఐమాక్స్‌లో 90 శాతం టికెట్లు అమ్ముడుపోయాయి. సినిమా విడుద‌ల‌కు 20 రోజులు ఉండ‌గానే టికెట్లు భారీగా బుక్ అవ్వడంపై చిత్ర యూనిట్ హ‌ర్షం వ్య‌క్తం చేసింది.

    Radhe Shyam

    కాగా ఇన్నిరోజుల ముందే ఇంత మొత్తం టికెట్లు అమ్ముడ‌వ‌డం ఇదే మొద‌టిసార‌ట‌. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌, ట్రైలర్‌తో సూపర్‌ క్రేజ్‌ని దక్కించుకుంది. అందుకే, రాధేశ్యామ్‌ చిత్రం అనగానే వేరే హీరో అభిమానులు కూడా బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ సినిమాని ఇండియన్‌ టైటానిక్ అంటూ అప్పుడే పోలికలు మొదలెట్టేశారు.

    Also Read:  మోడీతో ఫైట్: చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందా?

    అన్నట్టు ఈ క్రమంలో రాధేశ్యామ్‌ విడుదలకు ముందే మరో రికార్డుని సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రం మార్చ్‌ 11న విడుదల కానుండగా, యూఎస్ లోని ఐమాక్స్ థియేటర్‌ బుకింగ్స్‌లో కూడా అప్పుడే 70 శాతం టికెట్స్ అమ్ముడు పోయాయి. మొత్తానికి విడుదలకు ముందే రాధేశ్యామ్‌ రికార్డుల వెంట మొదలైనట్టు ఉంది.

    Radhe Shyam Movie

    ఎంతైనా నేషనల్ స్టార్ గా ప్రభాస్‌ రేంజ్‌ ప్యాన్‌ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో పెరిగిపోయింది. రాధేశ్యామ్‌ కోసం దాదాపు రూ. 350 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ క్రమంలో ప్రభాస్‌ నటించే యాక్షన్‌ బ్లాస్టర్‌ సలార్‌ పై ఓ ఆసక్తికర విషయం చర్చలో ఉంది. మొత్తానికి హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని.. మెయిన్ గా కళ్ళు చెదిరే యాక్షన్స్ తో అబ్బుర పరిచే విజువల్స్ తో ప్రభాస్ ఆకట్టుకుంటాడట.

    Also Read:  “కలియుగ కర్ణుడు” సోనూసూద్‌ పై కేసు నమోదు

    Tags