https://oktelugu.com/

Director Puri Jagannath: పాన్ వరల్డ్ ఏంటి పూరి ?.. ఇంతకీ హీరో ఎవరు ?

Director Puri Jagannath: డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొత్త సినిమా పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. పూరి పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నారని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం ఆ సినిమా చర్చల దశలోనే ఉందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండతో లైగర్, ఆ తర్వాత జనగణమన సినిమా పూర్తయిన తర్వాత ఈ పాన్ వరల్డ్ మూవీని పట్టాలెక్కించనున్నారట. అన్నట్టు ఈ సినిమాలో అంతర్జాతీయ స్థాయిలో పేరున్న నటీనటులతో అత్యంత భారీ చిత్రంగా ఈ […]

Written By:
  • Shiva
  • , Updated On : February 22, 2022 / 12:05 PM IST
    Follow us on

    Director Puri Jagannath: డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొత్త సినిమా పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. పూరి పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నారని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం ఆ సినిమా చర్చల దశలోనే ఉందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండతో లైగర్, ఆ తర్వాత జనగణమన సినిమా పూర్తయిన తర్వాత ఈ పాన్ వరల్డ్ మూవీని పట్టాలెక్కించనున్నారట.

    Puri Jagannadh

    అన్నట్టు ఈ సినిమాలో అంతర్జాతీయ స్థాయిలో పేరున్న నటీనటులతో అత్యంత భారీ చిత్రంగా ఈ సినిమాను తీయనున్నాడట. రాజమౌళి పుణ్యమా అని ప్రస్తుతానికి తెలుగు సినిమా పరిధి దాటిపోయింది. అసలు ఒకప్పుడు.. ఇంకా క్లుప్తంగా చెప్పుకుంటే.. బాహుబలికి ముందు వరకూ తెలుగు సినిమాకి హిందీలో కూడా గిరాకీ లేదు.

    Also  Read:  మోడీతో ఫైట్: చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందా?

    అలాంటిది ఇప్పుడు హిందీలో.. హిందీ సినిమాలు కంటే.. తెలుగు సినిమాలే ఎక్కువ కలెక్షన్స్ ను రాబడుతున్నాయి. అందుకే పూరీ కూడా పాన్ వరల్డ్ సినిమా అంటూ హడావుడి చేయడానికి బాగా ముచ్చట పడుతున్నట్టు ఉన్నాడు. ఇక ప్రస్తుతానికి పూరి డైరెక్షన్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ సినిమా రానుంది.

    Puri Jagannadh

    ఈ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని, అందుకే, లైగర్ తర్వాత కూడా విజయ్ దేవరకొండ పూరితోనే మరో సినిమా చేయాలని భావిస్తున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. గత వారం ఈ వార్తల పై క్లారిటీ ఇస్తూ పూరి టీమ్ ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. లైగర్ చిత్రం తర్వాత వెంటనే డైరెక్టర్ పూరీ.. విజయ్‌తో మరో మూవీ చేయనున్నాడు.

    గతంలో పూరీ జనగణమన పేరుతో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీనే ఇప్పుడు విజయ్ దేవరకొండతో చేస్తాడట. మొదట మహేష్ హీరోగా ఈ సినిమా చేయాలనుకున్నాడు పూరి. కానీ, అది ఇప్పట్లో కుదిరేలా లేదు. అందుకే.. అందుబాటులో ఉన్న విజయ్ దేవరకొండ వైపు వెళ్ళిపోయాడు పూరి. నిజానికి విజయ్ దేవరకొండ తన కెరీర్ లో కీలకమైన రెండేళ్ళ సమయాన్ని పూరీకే ఇచ్చాడు.

    Also  Read:  పార్వ‌తి పాట‌కు  కదిలిన హృదయాలు,  ప‌రుగులు పెట్టిన  బ‌స్సు

    Tags