https://oktelugu.com/

Bheemla Nayak Trailer: భీమ్లా నాయక్ ట్రైలర్ సునామీ.. రికార్డులు చెరిపేస్తూ ఊచకోత

Bheemla Nayak Trailer: ఒక్కసారి పవన్ కళ్యాణ్ వీరావేశంతో దిగితే ఇక ఇండస్ట్రీ రికార్డులు అన్నీ తుడిచిపెట్టిపోవడం ఖాయమని తాజాగా రిలీజ్ అయిన ‘భీమ్లానాయక్’ ట్రైలర్ తో స్పష్టమైంది. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ‘భీమ్లానాయక్’ సినిమా విడుదలకు ముందే రికార్డులు బద్దలు కొడుతోంది. నిన్న సోమవారం రాత్రి విడుదల చేసిన ట్రైలర్ ఆన్ లైన్ వేదికలపై సునామీలా దూసుకుపోతోంది. గత సినిమా రికార్డులన్నింటిని చెరిపివేస్తోంది. ఆర్ఆర్ఆర్ రికార్డును దాటేసి దూసుకుపోయింది. ట్రైలర్ టాక్ ఎలా ఉన్నప్పటికీ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 22, 2022 / 12:17 PM IST
    Follow us on

    Bheemla Nayak Trailer: ఒక్కసారి పవన్ కళ్యాణ్ వీరావేశంతో దిగితే ఇక ఇండస్ట్రీ రికార్డులు అన్నీ తుడిచిపెట్టిపోవడం ఖాయమని తాజాగా రిలీజ్ అయిన ‘భీమ్లానాయక్’ ట్రైలర్ తో స్పష్టమైంది. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ‘భీమ్లానాయక్’ సినిమా విడుదలకు ముందే రికార్డులు బద్దలు కొడుతోంది. నిన్న సోమవారం రాత్రి విడుదల చేసిన ట్రైలర్ ఆన్ లైన్ వేదికలపై సునామీలా దూసుకుపోతోంది. గత సినిమా రికార్డులన్నింటిని చెరిపివేస్తోంది. ఆర్ఆర్ఆర్ రికార్డును దాటేసి దూసుకుపోయింది.

    Pawan Kalyan Bheemla Nayak Trailer

    ట్రైలర్ టాక్ ఎలా ఉన్నప్పటికీ ఈ వీడియోకు భారీ స్పందన వచ్చింది. సోషల్ మీడియాను హోరెత్తిస్తూ లక్షల్లో లైకులు తెచ్చుకుంటోంది. అంతకుముందు వచ్చిన భారీ బడ్జెట్ సినిమాల రికార్డులను చెరిపేస్తూ సత్తా చాటుతోంది.

    తాజాగా ఆర్ఆర్ఆర్ రికార్డును కూడా భీమ్లా నాయక్ బద్దలు కొట్టింది. ట్రైలర్ టాక్ ఎలా ఉన్నప్పటికీ ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. సోషల్ మీడియాలో లక్షల్లో లైక్స్ వస్తున్నాయి. అంతకుముందు వచ్చిన బిగ్ బడ్జెట్ సినిమాల రికార్డ్ అధిగమిస్తోంది.

    Bheemla Nayak Trailer

    మొదట టాలీవుడ్ లో అత్యధిక వేగంగా 100K లైక్స్ అందుకున్న ట్రైలర్ గా రికార్డును నమోదు చేసిన భీమ్లా నాయక్.. ఆ తర్వాత 200k, 500k, 600k, దాటుకుంటూ 1 మిలియన్ లైక్స్ కూడా చాలా వేగంగా అందుకుంది. గత సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది.

    Also Read: Bheemla Nayak Trailer: జాతర చేస్తున్న పవన్‌ ఫ్యాన్స్‌.. కళ్ల ముందే అగ్నిగోళం

    రాజమౌళి తెరక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ 4.12 గంటల్లో 800K లైక్స్ అందుకొని రికార్డు క్రియేట్ చేయగా.. ఇప్పుడు భీమ్లా నాయక్ దాన్ని అధిగమించాడు. కేవలం 1.56 గంటల్లోనే ఆ ఫీట్ అందుకొని సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. విడుదలకు ముందే ఈ ఊచకోత చూసి పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ వస్తోంది.

    అయ్యప్పమ్ కోషియం మూవీకి తెలుగు రిమేక్ గా భీమ్లా నాయక్ వస్తోంది. ఈనెల 25న సినిమా విడుదల అవుతోంది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ , స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. తమన్ సంగీతం సమకూర్చారు. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

    Also Read: Bheemla Nayak RGV: ‘భీమ్లానాయక్’ ట్రైలర్ పై రాంగోపాల్ వర్మ హాట్ కామెంట్స్..

    Recommended Video:

    Tags