Raashi Khanna: రాశి ఖన్నా లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. ప్యాంటు అండ్ టాప్ ధరించి సూపర్ స్టైలిష్ లుక్ లో కేక పుట్టించింది. రాశి ఖన్నా గ్లామర్ గుండె గుల్ల చేస్తుంటే కుర్రాళ్ళు గగ్గోలు పెడుతున్నారు.రాశి అందాలు ఊరిస్తుంటే చూస్తూ గుటకలు వేస్తున్నారు. రాశి గ్లామర్ ఎంతగా జనాలను ఇబ్బంది పెడుతుందో ఆమె పోస్ట్ చేసిన ఫోటోల కింద ఉన్న కామెంట్స్ సెక్షన్ చూస్తే అర్థం అవుతుంది.

రాశి ఖన్నా లేటెస్ట్ వెబ్ సిరీస్ ఫార్జీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఫార్జీ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి వంటి స్టార్ క్యాస్ట్ ఫార్జీ వెబ్ సిరీస్లో నటించారు. రాశి ఫేక్ నోట్స్ కనిపెట్టడంలో ఎక్స్పర్ట్ అయిన ఆర్బీఐ ఎంప్లాయ్ రోల్ చేశారు. మేఘన క్యారెక్టర్ లో అలరించారు. ఫార్జీ సిరీస్ సక్సెస్ ఆమెకు బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నారు.

ఇక అధికారికంగా రాశి చేతిలో ఒకే ఒక చిత్రం ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న యోధ చిత్రంలో రాశి నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దిశా పటాని మరో హీరోయిన్. యోధ జులై 7న విడుదల కానుంది. యోధ సక్సెస్ అయితే రాశి ఖన్నాకు హిందీలో ఆఫర్స్ వచ్చే సూచనలు కలవు.

టాలీవుడ్ లో రాశికి ఆఫర్స్ వచ్చే సూచనలు లేవు. ఆమె గత మూడు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ప్రతిరోజూ పండగే చిత్రం తర్వాత ఆమెకు తెలుగులో మరో హిట్ పడలేదు. వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, థాంక్యూ వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో దర్శక నిర్మాతలు రాశిని తమ లిస్ట్ నుండి తీసేశారు. తమిళంలో మాత్రం ఆఫర్స్ వస్తున్నాయి. ఆ మధ్య కోలీవుడ్ లో రాశి వరుసగా చిత్రాలు చేశారు.

సినిమాలు తగ్గించారు.. పెళ్లి చేసుకుంటున్నారా? అని అడిగితే అదేం లేదన్నారు. కొన్ని కథలు విన్నాను. వాటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. ఊహలు గుసగుసలాడే మూవీతో వెలుగులోకి వచ్చిన రాశి ఖన్నా జిల్, తొలిప్రేమ, జై లవకుశ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. అయితే స్టార్ హీరోయిన్ హోదా ఆమెకు దక్కలేదు. రాశి నటించిన ఓన్లీ స్టార్ హీరో ఎన్టీఆర్. ఎందుకో మిగతా స్టార్స్ రాశి మీద ఆసక్తి చూపలేదు.
