Raashi khanna: స్టార్ హీరో సినిమాలో ప్లాప్ హీరోయిన్ ?

Raashi khanna: ‘రాశి ఖన్నా’ తెలుగు సినిమాల్లో చెప్పుకోదగ్గ ఛాన్స్ లు అందుకుని చాలా కాలమే అవుతుంది. అయితే ‘రాశి’కి వేరే భాషల్లో బాగానే అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా పలు తమిళ సినిమాలు చేసిన ‘రాశి ఖన్నా’, ఇప్పుడు మరో భారీ తమిళ్ ప్రాజెక్ట్ ను దక్కించుకున్నట్లు తమిళ మీడియా వర్గాలు ఓ వార్తను హైలైట్ చేస్తున్నాయి. తమిళ స్టార్ హీరో అజిత్ 61వ చిత్రంలో ‘రాశి ఖన్నా’ హీరోయిన్ గా చేస్తోందని ఆ వార్తల […]

Written By: Shiva, Updated On : April 20, 2022 4:11 pm
Follow us on

Raashi khanna: ‘రాశి ఖన్నా’ తెలుగు సినిమాల్లో చెప్పుకోదగ్గ ఛాన్స్ లు అందుకుని చాలా కాలమే అవుతుంది. అయితే ‘రాశి’కి వేరే భాషల్లో బాగానే అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా పలు తమిళ సినిమాలు చేసిన ‘రాశి ఖన్నా’, ఇప్పుడు మరో భారీ తమిళ్ ప్రాజెక్ట్ ను దక్కించుకున్నట్లు తమిళ మీడియా వర్గాలు ఓ వార్తను హైలైట్ చేస్తున్నాయి.

Raashi Khanna

తమిళ స్టార్ హీరో అజిత్ 61వ చిత్రంలో ‘రాశి ఖన్నా’ హీరోయిన్ గా చేస్తోందని ఆ వార్తల సారాంశం. వలిమై వంటి భారీ విజయం తర్వాత అజిత్ మళ్ళీ వినోద్ దర్శకత్వంలోనే మరో సినిమా చేస్తున్నాడు. వలిమైను నిర్మించిన బోనీ కపూర్ ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నాడు. మరి ఇలాంటి క్రేజీ సినిమాలో ‘రాశి ఖన్నా’కి హీరోయిన్ ఛాన్స్ అంటే.. ఇది విశేషమే.

Also Read: Beast Collection: బీస్ట్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు నష్టమో తెలుసా ?

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా చెన్నైలో మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో సెకండ్ షెడ్యూల్ సాగుతోంది. ఈ షెడ్యూల్ లో అజిత్ పై కొన్ని ఫైట్ సీక్వెన్స్ లు తెరకెక్కిస్తున్నారు. ఐతే.. ఈ రోజు నుంచి ‘రాశి ఖన్నా’ కూడా ఈ షూట్ లో పాల్గొంది. ఆమె పై విలన్ అటాక్ చేస్తే.. అజిత్ వచ్చి సేవ్ చేసే సీన్ ను ప్రస్తుతం షూట్ చేస్తున్నారు.

మరి ‘రాశి ఖన్నా’ది ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టరా ? లేక, సెకండ్ హీరోయిన్ లీడా ? అనేది చూడాలి. ఈ చిత్రంలో అయితే, అజిత్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ రెండు రోల్స్ లో ఒకటి నెగటివ్ రోల్ అని టాక్ నడుస్తోంది. ఈ సినిమా పై అజిత్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఇలాంటి భారీ సినిమాలో ‘రాశి ఖన్నా’ మెయిన్ క్యారెక్టర్ చేస్తే ఆమె దశ తిరిగినట్టే.

Raashi khanna

నిజానికి ఈ బబ్లీ హీరోయిన్ కి టాలెంట్ లేకపోయినా ఫుల్ గ్లామర్ ఉంది. ఇక ఎక్స్ ప్రెషన్స్ పలికించలేకపోయనా ఫుల్ ఎక్స్ పోజింగ్ చేస్తోంది. అందుకే ఈ బబ్లీ బ్యూటీ ‘రాశి ఖన్నా’ ఎలాగోలా కెరీర్ ను నెట్టుకొస్తూనే ఉంది.

Also Read:Chandrababu Naidu Birthday: బర్త్ డే ‘బాబు’: 40 ఇయర్స్ పాలిటిక్స్ లో అంటుకున్న మరకలు.. సాధించిన ఘనతలివీ!

Recommended Videos:

Tags