Priyanka Chopra: గ్లోబల్ బ్యూటీ అని ప్రియాంక చోప్రాకి ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ కి తగ్గట్టుగానే ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ ఉంది ఆమెకు. ఈ విషయం కొంతమంది బాలీవుడ్ స్టార్స్ కు నచ్చదు అనుకోండి, ప్రియాంక క్రేజ్ ముందు ఏ బాలీవుడ్ స్టార్ హీరో పనికిరాడు అని మరోసారి రుజువు అయింది. ‘ప్రియాంక చోప్రా’ ఇన్ స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల విషయంలో అందరి కంటే టాప్‌లో నిలిచింది.
మొత్తమ్మీద ఈ గ్లోబల్ బ్యూటీ మరోసారి తన క్రేజే సెపరేట్ అనిపించుకుంది. ప్రియాంక ఇన్‌స్టాలో 72.4మిలియన్ల మంది ఫాలోవర్స్ కలిగి ఉండటంతో పాటు ఇండియన్ స్టార్ల లిస్ట్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ కలిగి ఉన్న ఏకైక స్టార్ కూడా ఆమెనే. ఇక ప్రియాంక చోప్రా తర్వాత శ్రద్ధా కపూర్ 68.5మిలియన్లు ఉన్నారు. ఆ తర్వాత స్థానం దీపిక పదుకొణెకి దక్కింది. ఆమెకు 63.4మిలియన్లు ఉన్నారు.
అనుష్క శర్మకి 60.4 మిలియన్లు, కత్రినాకి 55.9మిలియన్లు ఉన్నారు. అందుకే, ప్రియాంక తన ఇన్ స్టాగ్రామ్ లో ఏదైనా ఒక కమర్షియల్ యాడ్ పోస్ట్ చేయాలంటే ఏకంగా ఒక్క పోస్ట్ కి 4 కోట్ల రూపాయలు తీసుకుంటుంది. షారుక్, సల్మాన్ లాంటి మాస్ హీరోలకు కూడా ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు. ఇంత భారీ మొత్తం తీసుకుంటున్న ఏకైక ఇండియన్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మాత్రమే.
Also Read: ఛాన్స్ కోసమే రాశి ఖన్నా ఆతనితో డేటింగ్ ?
ఇక బాలీవుడ్ హీరోయిన్లు ఒక్కో పోస్ట్ కి 8 నుంచి పది లక్షలు తీసుకుంటున్నారు. అది కూడా అందరికీ ఇవ్వట్లేదు. మొత్తానికి ప్రియాంక సోషల్ మీడియాలో యాడ్స్ పోస్ట్ లతో కూడా ఫుల్ గా సంపాదిస్తుంది. ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్ తో ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఏది ఏమైనా ప్రియాంకా చోప్రా అంటే ఒకప్పటి బాలీవుడ్ లో టాప్ హీరోయిన్.
హిందీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగి .. ఆ తర్వాత హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో రెచ్చిపోతూ గ్లామర్ ప్రపంచం పై తన మార్క్ చూపిస్తోంది. అసలు ‘ప్రియాంక చోప్రా’ చూపుల్లోని ఓ మత్తు ఉంటుంది. అన్నట్టు 63.4మిలియన్లు ఫాలోవర్స్ తో ప్రియాంక నిజమైన ఇండియన్ స్టార్ అనిపించుకుంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: చిక్కుల్లో ‘ఆర్ఆర్ఆర్’.. హైకోర్టులో పిటిషన్ వేసిన అల్లూరి వారసురాలు..