ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన సాగుతోందా? ప్రజాస్వామ్య దేశంలో వాక్ స్వాతంత్రం లేదా అని ప్రశ్నిస్తున్నారు. సగటు పౌరుడికి దేశంలో జరుగుతున్న అరాచకాలపై పెదవి విప్పే అధికారం లేదా అని ప్రజాస్వామ్యవాదులు చెబుతున్నారు. ప్రజాస్వామ్య విలువల్ని మంటగలిపి రాక్షసంగా ప్రవర్తించడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. అతడేమైనా వీరి బంధువా? కులమా? ఎందుకు స్పందించాలి. అభిమానం ఉంటే లోపల ఉంచుకోవాలి కానీ నేతలపై దాడులకు తెగబడటం ఏమిటని ఆందోళన చెందుతున్నారు.
ఏపీలో ప్రతిపక్ష పార్టీలకు విలువ ఉండదా? అధికార పార్టీదే పెత్తనమా? వైసీపీ నాయకులు ఏది తోస్తే అది చేస్తూ పోతే ఇక ఇతరులకు మనుగడ ఉండకుండా చేయడమేనా వారి పని అని అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం మండలానికి చెందిన కొందరు బీజేపీ కార్యకర్తలు తమకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనికి స్థానికి ఎమ్మెల్యే, టీప్పుసుల్తాన్ వీరాభిమాని అయిన రాచమల్లు శివప్రసాద్ ప్రోత్సాహంతో అనుచరుడు రవీంద్ర రెడ్డి తదితరులు గత రాత్రి కత్తులతో ప్రసాద్, నరసింహులులపై దాడిచేసి హత్యాయత్నం చేశారు.
డెమోక్రసీలో ప్రశ్నించే గొంతుకలపై దాడులకు పాల్పడితే ఇక దిక్కెవరని అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాడులకు తెగబడటం హీరోయిజం కాదని తెలిసినా వారిలోని నైతికత ఏమైందని ప్రశ్నలు వస్తున్నాయి. ఎమ్మెల్యే కూడా ఇలాంటి వాటిని చేయించడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసి విన్నవించారు.
వైసీపీ నాయకుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. తమకు పథకాలు అందడం లేదని విన్నవిస్తే తప్పు ఎలా అవుతుంది. వారిపై కుట్రపూరితంగా దాడులు చేయడంతో ఎలాగని బీజేపీ నేతల్లో ఆందోళన కలుగుతోంది. వైసీసీ నాయకుల అక్రమ చర్యలకు ముకుతాడు వేసే విధంగా చర్యలు చేపట్టాల్సిన అధికార యంత్రాంగం సైతం చూసీచూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ నేతలను అదుపు చేయాలని కోరుతున్నారు.