Pawan Kalyan : పవన్ కళ్యాణ్ టాలీవుడ్ టాప్ స్టార్. భారీ ఫ్యాన్ బేస్ కలిగిన హీరో. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన చిత్రాలు వసూళ్లు రాబడతాయి. అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ కి భక్తులు ఉంటారు అనేది ఓ నానుడి. పవన్ కళ్యాణ్ కి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నార్త్ లో కూడా క్రేజ్ ఉంది. అందుకు ఓ సంఘటన నిదర్శనంగా నిలిచింది. ప్రముఖ హిందీ రియాలిటీ షో కోన్ బనేగా కరోడ్ పతీ లో పవన్ కళ్యాణ్ పై ప్రశ్న అడిగారు.
కోన్ బనేగా కరోడ్ పతీ దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న షో. బిగ్ బీ అమితాబ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం 16వ సీజన్ నడుస్తుంది. హోస్ట్ అమితాబ్ తన ఎదురుగా హాట్ సీట్ లో కూర్చున్న వ్యక్తిని ఒక ప్రశ్న అడిగారు. అది పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ప్రశ్న. 2024లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన నటుడు ఎవరు? అని అడిగాడు.
ఈ ప్రశ్నకు కంటెస్టెంట్ ఆడియన్స్ పోల్ ఆప్షన్ తీసుకున్నాడు. 50 శాతానికి పైగా ఆడియన్స్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పారు. దాంతో పవన్ కళ్యాణ్ అనే ఆన్సర్ ని అమితాబ్ లాక్ చేశాడు. అది సరైన సమాధానం కావడంతో కంటెస్టెంట్ రూ.1.60 లక్షలు గెలుచుకుని నెక్స్ట్ ప్రశ్నకు వెళ్ళాడు. నార్త్ ఆడియన్స్ సరైన సమాధానం చెప్పడం ద్వారా, పవన్ కళ్యాణ్ కి అక్కడ కూడా భారీ క్రేజ్ ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది.
రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీతో పలుమార్లు భేటీ అయ్యాడు. ఆయనతో వేదిక పంచుకున్నాడు. ఆ విధంగా కూడా ప్రజల్లో ఆయనకు గుర్తింపు ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ మూడు చిత్రాల షూటింగ్స్ పూర్తి చేయాల్సి ఉంది. హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ కొంత మేర షూటింగ్ జరుపుకుని ఉన్నాయి.
ఇటీవల ఓజీ షూటింగ్ పవన్ కళ్యాణ్ తిరిగి ప్రారంభించినట్లు సమాచారం. ఏపీలో వరదల నేపథ్యంలో మరల ఆయన ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీ అయ్యారు. చెప్పాలంటే ఆ మూడు చిత్రాలు ఎప్పుడు పూర్తి అవుతాయనే గందరగోళం నెలకొని ఉంది. నిర్మాతల కోసం పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఆ చిత్రాల షూటింగ్స్ లో పాల్గొనాలని భావిస్తున్నారు.