https://oktelugu.com/

South Film Industry : రజినీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి చేయాల్సిన సినిమా ఎందుకు మిస్ అయింది..?

సినిమా ఇండస్ట్రీ ఒక పెద్ద సముద్రం లాంటిది. అందులో మనం ప్రత్యేకంగా కనబడాలంటే మాత్రం మన సినిమాను చాలా గొప్ప గా తీర్చి దిద్దాల్సిన అవసరం అయితే ఉంది...

Written By: , Updated On : September 14, 2024 / 12:37 PM IST
South Film Industry 

South Film Industry 

Follow us on

South Film Industry : సౌత్ సిని ఇండస్ట్రీమాలో స్టార్ హీరోలుగా గుర్తింపు పొందిన వాళ్లలో రజనీకాంత్, కమలహాసన్, మోహన్ లాల్, మమ్ముట్టిలు మొదటి స్థానంలో ఉంటారు. ఇక వీళ్ళు నలుగురు వాళ్ళ ఇండస్ట్రీ తరపున వరుస సినిమాలో చేస్తూ సూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఎవరికి దక్కని ఒక అరుదైన గౌరవాన్ని కూడా వీళ్ళు దక్కించుకున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇటు కోలీవుడ్ మాలీవుడ్ ప్రేక్షకులు సైతం వీళ్ళ సినిమాలకు బ్రహ్మరథం పట్టారు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా రావాలని చాలామంది చాలా రకాల ప్రయత్నాలు అయితే చేశారు. ఇక ఈ నలుగురు హీరోలని మేనేజ్ చేస్తూ కథని కూడా రాసుకున్న దర్శకులు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నప్పటికీ వాళ్ళు చెప్పిన కథలు ఏవి వీళ్లకు నచ్చలేదు. ఒక సందర్భంలో వీళ్ళు నలుగురిని పెట్టి సినిమా చేస్తే అది ఇండస్ట్రీ హిట్టుగా మిగులుతుందని చాలామంది దర్శక నిర్మాతలు భావించారు. కానీ కథ ఒకరికి ఇమేజ్ కి సెట్ అయితే మరొకరు ఇమేజ్ కి సెట్ అవ్వకపోవడం తో చాలామంది దర్శకులు చాలా రకాల ఇబ్బందులు అయితే పడ్డారు. ఇక ఫైనల్ గా ఈ ప్రాజెక్టు మొత్తాన్ని పక్కన పెట్టారు.ఒక లెజెండరీ దర్శకుడు అయితే ఈ నలుగురితో సినిమాని అనౌన్స్ చేసినప్పటికీ ఆ సినిమా తెరపైకైతే రాలేదు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే కే బాలచందర్…

నిజానికి రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరినని ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు కూడా ఈయనే కావడం విశేషం…ఇక ఈయన పరిచయం చేసిన వీళ్ళిద్దరూ ఇండస్ట్రీని ఏలుతుండటం నిజంగా ఒక రకంగా చాలా గర్వకారణం అనే చెప్పాలి. మరి ఆయన మీద ఉన్న గౌరవంతో వీళ్ళిద్దరూ మోహన్ లాల్ మమ్ముట్టి లతో కలిసి నటించడానికి చాలావరకు ప్రయత్నం అయితే చేశారు. ఒక మంచి కథతో ఈ నలుగురితో సినిమా చేయాలని చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. కానీ ఆయన ప్రయత్నం కూడా ఫలించలేదు.

ఇక మొత్తానికైతే రెండు భాషల ప్రేక్షకులందరికి ఈ నలుగురి కాంబినేషన్ లో సినిమా రాలేదే అనే ఒక లోటైతే అలాగే ఉండిపోయిందనే చెప్పాలి…ఇక మొత్తానికైతే ఈ నలుగురి కాంబినేషన్ లో రావాల్సిన సినిమాలు ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వచ్చాయి.

మరి ఇప్పటికైనా వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయా అనే ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. మరి ఇప్పటి దర్శకులు వీళ్ళ ఇమేజ్ ని బ్యాలెన్స్ చేస్తూ కథను తయారు చేయగలరా? అలా చేస్తే మాత్రం ఇప్పటి వీళ్ళు నలుగురు కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది…